Samantha: సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయిన సామ్.. కారణమేంటంటే..
Actress Samantha: సినిమాలతో పాటు సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత (Samantha) కూడా ఒకరు. నిత్యం సినిమా విశేషాలతో పాటు తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అదేవిధంగా తన వ్యక్తిగత విషయాలను
Actress Samantha: సినిమాలతో పాటు సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో సమంత (Samantha) కూడా ఒకరు. నిత్యం సినిమా విశేషాలతో పాటు తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అదేవిధంగా తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పుడు సమకాలీన అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. మధ్యలో తప బ్రాండ్ ప్రమోషన్స్‌ను కూడా చేసుకునేది. ఇలా ఏదో ఒక రకంగా నెట్టింట్లో చురుకుగా ఉండే సామ్.. సడెన్‌గా సైలెంట్ అయిపోయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి సుమారు రెండు వారాలు గడిచిపోయింది. ఆమె చివరిగా జూన్ 30న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఇన్‌స్టాలో టోటల్ సైలెంట్. ట్విటర్‌లో కూడా ఎలాంటి అప్‌డేట్స్ పెట్టలేదు. దీంతో సామ్‌కు ఏమైందోనని అభిమానులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండిView this post on Instagram
ఇదిలా ఉంటే ఆ మధ్య సమంత ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సామ్ ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ పెట్టలేదు. ఈక్రమంలో సమంత ఎందుకు నెట్టింటికి దూరమైంది? సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండిపోయిందా? లేదా కావాలనే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటుందా అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. కొంతమంది ఆమె సోషల్ మీడియా డిటాక్స్‌లో ఉందని అంటుంటే.. మరికొంతమంది మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే ఆమె నెట్టింటికి దూరంగా ఉంటుందంటున్నారు. త్వరలోనే పెద్ద బ్రేకింగ్ న్యూస్‌తో సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇస్తుందని ఇంకొందరు భావిస్తున్నారు. మరి నెట్టింట్లో సామ్ మౌనానికి కారణమేంటో? ఎప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతుందో సమంత నోరువిప్పేవరకు ఆగాల్సిందే.
View this post on Instagram
ఇక సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే శాకుంతంల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్. దీంతో పాటు యశోద సినిమాలోనూ నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండంతో కలిసి ఖుషి అనే ప్రాజెక్టులోనూ ఆమే హీరోయిన్. దీంతో పాటు బాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..