ఇదెక్కడి రొమాంటిక్ సినిమారా సామీ.! పెళ్లి ఒక్కడితో.. హనీమూన్ మరొకడితో..

|

Sep 16, 2024 | 7:49 PM

ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా అదరగొడుతోంది. టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఆ సినిమా. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో హనీమూన్ కు వెళ్తుంది.

ఇదెక్కడి రొమాంటిక్ సినిమారా సామీ.! పెళ్లి ఒక్కడితో.. హనీమూన్ మరొకడితో..
Romantic Movie
Follow us on

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందుతుంది. థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే ఓటీటీల్లో థియేటర్స్ లో ఆకట్టుకున్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో చాలా సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్స్, హారర్ , రొమాంటిక్ సినిమాలకు డిమాండ్ ఉంటుంది. అలాగే డైరెక్టర్స్ కూడా ఇలాంటి జోనర్స్ లోనే సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా అదరగొడుతోంది. టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఆ సినిమా. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో హనీమూన్ కు వెళ్తుంది. అలాగే రొమాంటిస్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి ఈ సినిమాలో.

ఇది కూడా చదవండి: సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..? అసలు విషయం బయటపెట్టిన నటి

ఈ సినిమాలో ఇంట్లో పరిస్థితులు బాగోక.. ఆమె పెళ్ళికి ఒకే చెప్తుంది. కానీ పెళ్లి తర్వాత ప్రియుడితో హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. ఆ విషయం భర్తకు తెలుస్తుంది. చివరికి విడిపోయే వరకు వెళ్తారు. ఆమె కలను నెరవేర్చుకోవడం కోసం పెళ్లైన తర్వాత హీరోయిన్ వేరే ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. అతనితో ప్రేమలో పడుతుంది. అలాగే ఆ ఇద్దరూ శారీరకంగానూ కలుస్తారు. దాంతో ఆమెకు గర్భం వస్తుంది. అయితే ఆమె గర్భంలో ఇద్దరు కవలలు ఉన్నారని.. ఆ కవలలకు వేరు వేరు డీఎన్ఏ ఉందని డాక్టర్స్ చెప్తారు. దాంతో ఆ పిల్లలకు తండ్రి ఎవరు అనేది తెలియక సతమతం అవుతుంది ఆ హీరోయిన్. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ఇక ఈ సినిమా పేరు బ్యాడ్ న్యూస్. బాలీవుడ్ లో ఈ సినిమా తెరకెక్కింది. విక్కీ కౌశ‌ల్‌, అమీ ఆర్క్‌, త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి :దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.