Mechanic Rocky Twitter Review: మెకానిక్ రాకీ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.. ?

|

Nov 22, 2024 | 8:38 AM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చివరగా గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో థియేటర్లలో సందడి చేసిన విశ్వక్.. ఇప్పుడు మెకానిక్ రాకీ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు.

Mechanic Rocky Twitter Review: మెకానిక్ రాకీ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.. ?
Mechanic Rocky
Follow us on

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ మెకానిక్ రాకీ. డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముందే జనాల్లో క్యూరియాసిటిని కలిగించింది. ఫస్ట్ గేర్ , ట్రైలర్, పాటలతో సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇన్నాళ్లు విశ్వక్ సేన్ సైతం తన సినిమాకు మంచి ప్రమోషన్స్ నిర్వహించాడు. తాజాగా ఈరోజు ఈ చిత్రం అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల ప్రీమియర్స్‏తోపాటు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన అడియన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

మెకానిక్ రాకీ ఎలా ఉంది.. ? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా ? అనేది తెలుసుకుందాం. ఈ సినిమాకు ట్విట్టర్ ఖాతాలో పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని.. విశ్వక్ తన నటనతో మరోసారి అదరగొట్టారని అంటున్నారు. సెకండాఫ్ అదిరిపోయిందని.. దుమ్ములేపేశావ్ అంటూ విశ్వక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఉదయం నుంచే మెకానిక్ రాకీ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇదివరకే విశ్వక్ తన సినిమాకు రివ్యూ ఇచ్చేసుకున్నాడు. ఈ సినిమాలో సెకండాఫ్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుందని.. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని.. ట్విస్టులు సైతం అదిరిపోతాయని అన్నాడు. ఇప్పుడు అడియన్స్ నుంచి వస్తున్న టాక్ కూడా అలాగే ఉంది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.