AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: సొంతంగా మట్టి వినాయకుడిని తయారు చేసిన విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్.. వీడియోలు ఇదిగో

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చవితి వేడుకలు శనివారమే అయిపోయినా చాలా చోట్ల సుమారు వారం రోజులకు పైగానే ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే గణపతి విగ్రహాల నిమజ్ఞనం కూడా ప్రారంభమైంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు

Vishwak Sen: సొంతంగా మట్టి వినాయకుడిని తయారు చేసిన విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్.. వీడియోలు ఇదిగో
Tharun Bhascker, Vishwak Sen
Basha Shek
|

Updated on: Sep 09, 2024 | 2:49 PM

Share

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చవితి వేడుకలు శనివారమే అయిపోయినా చాలా చోట్ల సుమారు వారం రోజులకు పైగానే ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే గణపతి విగ్రహాల నిమజ్ఞనం కూడా ప్రారంభమైంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా గణేశ్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటున్నారు. తమ ఇంట్లోనే బుల్లి గణపతులను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. కాగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే పూజించండి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది సెలబ్రిటీలు మట్టి విగ్రహాలనే కొని తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సొంతంగా తమ చేత్తోనే మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేసి పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గతంలో అందరూ మట్టి తీసుకొచ్చి ఇంట్లోనే సొంతంగా వినాయకుడిని తయారుచేసి పూజలు చేసే వాళ్లు. కానీ ఇప్పుడు అందరూ బయటే విగ్రహాలు కొనుక్కుంటున్నారు. అయితే హీరో విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాత్రం అలా చేయలేదు. బయటి నుంచి మట్టి తీసుకొచ్చి సొంతంగా తమ చేతులతో వినాయక విగ్రహాలను తయారుచేసారు. అనంతరం తమ ఇంట్లో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు.

మట్టి విగ్రహాలను తయారుచేస్తుండగా తీసిన వీడియోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్. అలాగే అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు హీరో, డైరెక్టర్లను అభినందిస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హతో కలిసి గణనాథుడికి పూజలు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇంట్లో మట్టి వినాయకుడిని తయారు చేస్తోన్న విశ్వక్ సేన్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Vishwak Sen (@vishwaksens) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంట్లోనూ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ్ భార్య ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, శర్వానంద్, నాగ శౌర్య, నిఖిల్ సిద్ధార్థ, యాంకర్ లాస్య, ఆది సాయి కుమార్ ఇళ్లలోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇంట్లో మట్టి గణపతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
త్వరలోనే పట్టాలెక్కనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు
త్వరలోనే పట్టాలెక్కనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు
అబ్బ సాయిరాం.. గ్యాస్ సరఫరాపై కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
అబ్బ సాయిరాం.. గ్యాస్ సరఫరాపై కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
క్రెడిట్‌ కార్డ్‌ అతిగా వాడితే ఇంత డేంజరా?
క్రెడిట్‌ కార్డ్‌ అతిగా వాడితే ఇంత డేంజరా?
హాలీవుడ్‌లో ఉన్నా ‘ఘర్ కా ఖానా’ అంటే ప్రాణం! ప్రియాంకకు నచ్చిన
హాలీవుడ్‌లో ఉన్నా ‘ఘర్ కా ఖానా’ అంటే ప్రాణం! ప్రియాంకకు నచ్చిన
మేకప్ లేకుండా మెరిసిపోవాలా? గ్లామర్ క్వీన్ చెప్పిన బ్యూటీ టిప్స్‌
మేకప్ లేకుండా మెరిసిపోవాలా? గ్లామర్ క్వీన్ చెప్పిన బ్యూటీ టిప్స్‌
ఇది తెలిస్తే ఎప్పుడు కూడా ఈ వస్తువులను గిఫ్ట్‌గా అస్సలు ఇవ్వరు!
ఇది తెలిస్తే ఎప్పుడు కూడా ఈ వస్తువులను గిఫ్ట్‌గా అస్సలు ఇవ్వరు!
వంటగదిలో చేసే చిన్న పొరపాట్లకు చెక్ పెట్టండిలా!
వంటగదిలో చేసే చిన్న పొరపాట్లకు చెక్ పెట్టండిలా!
ముడతలు లేని చర్మం కోసం మలైకా చెబుతున్న బ్యూటీ టిప్స్
ముడతలు లేని చర్మం కోసం మలైకా చెబుతున్న బ్యూటీ టిప్స్
ఇంటర్నెట్ డేటా వాడకంపై ట్యాక్స్..?
ఇంటర్నెట్ డేటా వాడకంపై ట్యాక్స్..?
ఇదిరా పాక్ టీం అంటే.. పొడిచేస్తామంటూ వెళ్లి.. పరువుతీసుకున్నారుగా
ఇదిరా పాక్ టీం అంటే.. పొడిచేస్తామంటూ వెళ్లి.. పరువుతీసుకున్నారుగా