Vishnu Manchu: వారసుడొచ్చాడు.. సినిమాల్లోకి మంచు విష్ణు కొడుకు.. ఆ సినిమాలో కీలక పాత్ర

జిన్నా సినిమా తరువాత మంచు విష్ణు నటిస్తున్న సినిమా కన్నప్ప హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవలే అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చారు కన్నప్ప టీమ్. సుమారు 500మందితో అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది.

Vishnu Manchu: వారసుడొచ్చాడు.. సినిమాల్లోకి మంచు విష్ణు కొడుకు.. ఆ సినిమాలో కీలక పాత్ర
Manchu Vishnu

Updated on: Jan 05, 2024 | 5:06 PM

మంచి విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జిన్నా సినిమా తరువాత మంచు విష్ణు నటిస్తున్న సినిమా కన్నప్ప హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవలే అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చారు కన్నప్ప టీమ్. సుమారు 500మందితో అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వీఎఫెక్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు ఉండనున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు తన కొడుకు సినీ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. తాను నటిస్తున్న కన్నప్ప సినిమాలో తన కొడుకు కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిపారు మంచు విష్ణు. మంచు విష్ణు కొడుకు అవ్రామ్ కన్నప్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈవిషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఈ విషయం పై మంచు విష్ణు స్పందిస్తూ.. ఒక కొత్త శకం ఆవిష్కృతమవుతున్నప్పుడు థ్రిల్‌కు మించి ఉంది! అవ్రామ్ మంచు ‘కన్నప్ప’తో సినీ ప్రపంచం లోకి అడుగుపెట్టాడు, మంచు కుటుంబానికి మరో అద్భుతమైన అధ్యాయాన్ని జోడించి, తరతరాలను ముందుకు తీసుకువెళ్తాడు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మంచు విష్ణు. ఇది మా కుటుంబంలో కొత్త నాంది అని తెలిపారు మంచు విష్ణు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి