
స్టార్ హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏవీ రాజు కామెంట్లకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఏవీ రాజు వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. త్రిషకు అండగా నిలుస్తామంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ హీరో విశాల్ స్పందించారు. ఎక్కడా ఏవీ రాజు పేరు డైరెక్ట్ గా ప్రస్తావించకుండా తన దైన శైలిలో మండి పడ్డారు.ఇలాంటి రాక్షసుడి గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదంటూ ట్వీట్ చేశాడు విశాల్. ‘ఒక పొలిటికల్ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసభ్యకరంగా కామెంట్స్ చేశాడని విన్నాను. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేం మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కొలీగ్స్ కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న మహిళలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను మనసారా కోరుకుంటున్నా’ అని వార్నింగ్ ఇచ్చాడు విశాల్.
‘ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై రివేంజ్ తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా నాకు మాటలు రావడం లేదు. నిజాయితీగా, వాస్తవంగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయడం లేదు. సాటి మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత కాలం మనిషిలాగా మాత్రం ఉండలేరు. డబ్బు కోసమే అయితే ఒక మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం బేసిక్ క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఒక బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి’ అంటూ తనదైన శైలిలో కౌంటరిచ్చారు విశాల్.
I just heard that a stupid idiot from a political party spoke very ill and disgustingly about someone from our film fraternity. I will not mention your name nor the name of the person you targeted because I know you did it for publicity. I definitely will not mention names…
— Vishal (@VishalKOfficial) February 20, 2024
ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత అదితీ రవీంద్రనాథ్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏవీ రాజు కామెంట్స్ ను ఖండించిన ఇలాంటి నీచులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Shocked & disgusted by the behaviour of Ex AIADMK functionary A. V. Raju for making unwarranted , baseless, loose and completely false allegations about Trisha. It is 2024; we talk about women empowerment & equality – why drag an unrelated person into personal mud slinging. There…
— Aditi Ravindranath (@aditi1231) February 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.