AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virupaksha: బాక్సాఫీస్‌ వద్ద ‘విరూపాక్ష’ విధ్వంసం.. కేవలం 4 రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌లోకి తేజ్‌ సినిమా

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ తర్వాత కోలుకుని నటించిన సినిమా విరూపాక్ష. మలయాళం సెన్సేషన్‌ సంయుక్త మేనన్‌ తేజ్‌కు జోడీగా నటించింది ఈ సినిమాలో. సూపర్‌ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్‌ శిష్యుడు కార్తీక్‌ దండు దర్శకత్వం వహించారు.

Virupaksha: బాక్సాఫీస్‌ వద్ద 'విరూపాక్ష' విధ్వంసం.. కేవలం 4 రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌లోకి తేజ్‌ సినిమా
Virupaksha Movie
Basha Shek
|

Updated on: Apr 25, 2023 | 3:56 PM

Share

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ తర్వాత కోలుకుని నటించిన సినిమా విరూపాక్ష. మలయాళం సెన్సేషన్‌ సంయుక్త మేనన్‌ తేజ్‌కు జోడీగా నటించింది ఈ సినిమాలో. సూపర్‌ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్‌ శిష్యుడు కార్తీక్‌ దండు దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 21న సైలెంట్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టిన విరూపాక్ష ఫస్ట్‌ షో నుంచే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమాలోని ట్విస్టులు, హర్రర్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఈక్రమంలోనే సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ అందుకుంది విరూపాక్ష. మొదటి రోజు రూ. రూ.12 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. వీకెండ్స్‌ను బాగా క్యాష్‌ చేసుకుంది. శని, ఆదివారాల్లో వరసగా చెరో రూ.16 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సోమవారం కాస్త తగ్గి కేవలం రూ.6 కోట్లు వసూలు చేసింది. మొత్తానికి నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల మార్క్ ని అందుకుంది. తద్వారా నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెట్‌ టార్గెట్‌ను పూర్తిచేసింది. ఇక మంగళవారం సాయంత్రం నుంచి వచ్చే వసూళ్లన్నీ కూడా ‘విరూపాక్ష’కి లాభాల కిందే లెక్క.

కాగా విరూపాక్ష సినిమా రూ.50కోట్ల క్లబ్‌లోకి చేరవడంపై దర్శకనిర్మాతలు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నారు. విరూపాక్ష సినిమాకు సుకుమార్‌ అందించిన గ్రిప్పింగ్‌ స్ర్కీన ప్లే హైలెట్‌గా నిలిచింది. అలాగే కాంతారా ఫేమ్‌ అజనీశ్‌ లోక్‌నాథ్‌ అందించిన బీజీఎమ్‌, స్వరాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కాగా సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం, సబ్జెక్టు కూడా ఇంట్రెస్ట్ గా ఉండడంతో ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?