Virgin Boys Movie Review: వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

ప్రమోషన్స్‌తోనే ఈ మధ్య ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా వర్జిన్ బాయ్స్. టికెట్ కొట్టు.. ఐఫోన్ పట్టు అంటూ కొత్త రకం ప్రచారంతో బాగానే జనాల్లోకి వెళ్లిపోయారు యూనిట్. అన్నట్లుగానే హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్ లాంటి చాలా సిటీస్‌లో టికెట్ కొన్న ప్రేక్షకులకు లాటరీలో డబ్బులు కూడా ఇచ్చారు మేకర్స్. అలాగే హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో ఓ ప్రేక్షకుడికి ఐఫోన్ కూడా ఇచ్చారు మేకర్స్.

Virgin Boys Movie Review: వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ..  సినిమా ఎలా ఉందంటే..
Virgin Boys Movie Review

Edited By: Rajitha Chanti

Updated on: Jul 11, 2025 | 4:38 PM

మూవీ రివ్యూ: వర్జిన్ బాయ్స్

నటీనటులు: గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్ తదితరులు

సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి

ఇవి కూడా చదవండి

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

సినిమాటోగ్రఫర్: వెంకట ప్రసాద్

PRO: మధు విఆర్

నిర్మాత: రాజా దారపునేని

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: దయానంద్

ప్రమోషన్స్‌తోనే ఈ మధ్య ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా వర్జిన్ బాయ్స్. టికెట్ కొట్టు.. ఐఫోన్ పట్టు అంటూ కొత్త రకం ప్రచారంతో బాగానే జనాల్లోకి వెళ్లిపోయారు యూనిట్. అన్నట్లుగానే హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్ లాంటి చాలా సిటీస్‌లో టికెట్ కొన్న ప్రేక్షకులకు లాటరీలో డబ్బులు కూడా ఇచ్చారు మేకర్స్. అలాగే హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో ఓ ప్రేక్షకుడికి ఐఫోన్ కూడా ఇచ్చారు మేకర్స్. బోల్డ్ ప్రమోషన్స్ తర్వాత జులై 11న విడుదలైంది వర్జిన్ బాయ్స్. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, మిత్రా శర్మతో పాటు గీతానంద్, జెనీఫర్ ఇమ్మానుయేల్, రోనీత్ రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. గీతానంద్ సోదరుడు దయానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైందిప్పుడు. మరి వర్జిన్ బాయ్స్ ఎలా ఉంది..? ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఒక యూనివర్సిటీలో డుండీ (శ్రీహాన్), ఆర్య (గీతానంద్), రోనీ (రోనీత్ రెడ్డి) ఫ్రెండ్స్. కాలేజీలో అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళ ముగ్గురికి తప్ప. వాళ్లకు గాళ్ ఫ్రెండ్ లేదని మరో ఫ్రెండ్ స్నేహితుడు (కౌశల్) వాళ్లను మరింత రెచ్చగొడతాడు. “నేను అమెరికా నుంచి ఇండియా రిటర్న్ అయ్యేలోపు మీరు వర్జినిటీ కోల్పోవాలి” అని సవాల్ విసురుతాడు. ఈ సవాల్‌ను స్వీకరించిన ముగ్గురు స్నేహితులు.. ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతారు. ఈ క్రమంలోనే జెనీఫర్‌తో డుండీ, సరయు (మిత్రా శర్మ)తో ఆర్య, శ్లోక (అన్షులా ధావన్)తో రోనీ లవ్ ట్రాక్ నడిపిస్తారు. అయితే, వాళ్ల ప్రేమ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి వాళ్ల ప్రేమ ఫలించిందా లేదా..? లవ్ టాక్స్ సక్సెస్ అయ్యాయా.. వర్జినిటీ సవాల్ ఏమైంది అనేది మిగిలిన కథ..

కథనం:

తెలుగులో అడల్డ్ కామెడీ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. అలాంటి బోల్డ్ కథల వైపు మన దర్శకులు మ్యాగ్జిమమ్ వెళ్లరు. తాజాగా ‘వర్జిన్ బాయ్స్’తో అదే చేసి చూపించాలని ఫిక్సైపోయాడు దర్శకుడు దయానంద్. తమ సినిమా పెద్దల కోసమే అని ముందు నుంచే ప్రమోట్ చేసుకున్నారు వాళ్లు. అన్నట్లుగానే ట్రైలర్ నుంచి మొదలుపెట్టి ప్రతీ ప్రమోషన్‌లోనూ వర్జిన్ బాయ్స్ గురించి ఓపెన్‌గానే ప్రమోట్ చేసారు. తమ సినిమాలో అడల్డ్ కంటెంట్ ఉంటుందని ట్రైలర్ నుంచే చెప్పారు.. వాళ్లు ప్రమోషన్‌లో చెప్పిన దానికంటే థియేటర్‌లో మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది ఆ డోస్. కొన్ని బోల్డ్ జోక్స్ ఉన్నా కూడా.. ఈ సినిమా ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసింది. కాలేజీలో కొత్తగా చేరిన యువతలో చాలా మందికి గర్ల్‌ఫ్రెండ్ ఉండాలని, వర్జినిటీ కోల్పోవాలని కోరిక ఉంటుంది. అదే మెయిన్ పాయింట్‌గా తీసుకుని ఈ సినిమా చేసాడు దయానంద్. దాన్ని చాలా బోల్డ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు. అయితే వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమే ముఖ్యమనే సందేశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ క్రమంలోనే తీసుకున్న కథకు తగ్గట్లుగా అక్కడక్కడ బోల్డ్ జోక్స్, స్కిన్ షో బాగానే ఉంది. కాకపోతే రైటింగ్‌లో బలం లేకపోవడంతో ఓ సీదాసాదా సినిమాగానే మిగిలిపోయింది ఇది. ఇమ్యేచ్యూర్ కథ, కథనాలు ప్రేక్షకులను బాగా విసిగిస్తాయి. మీరు ఏదైతే ఎంజాయ్ చేయాలని ఫిక్సైపోయి థియేటర్‌కు వెళ్తారో.. అలాంటి ఆడియన్స్‌కు మాత్రం వర్జిన్ బాయ్స్ కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా ‘మ్యాడ్’ లాంటి సినిమాల ఛాయలు బాగానే కనిపిస్తాయి. వర్జినిటీ కోల్పోవడానికి సిద్ధమైన ముగ్గురు యువకుల కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు.

నటీనటులు:

బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్. మనోడు బాగా బోల్డ్‌గా నటించేసాడు. స్క్రీన్ మీద చూడ్డానికి కూడా బాగున్నాడు. కామెడీ టైమింగ్ బాగుంది. గీతానంద్ కూడా బాగానే ఉన్నాడు.. ఈజ్‌తో నటించాడు. రోనీత్ రెడ్డి ఓకే.. మిత్రా శర్మ కొంత బొద్దుగా కనిపించినప్పటికీ పర్లేదనిపిస్తుంది. జెనీఫర్ ఇమ్మానుయేల్, అన్షులా ధావన్ తమ తమ పాత్రల్లో ఓకే. నటి మధుమణి కుమారుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. బంచిక్ బబ్లు చాలా రోజుల తర్వాత కనిపించాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:

స్మరణ్ సాయి అందించిన సంగీతం పర్లేదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఎడిటింగ్ ఓకే.. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు దయానంద్ తాను అనుకున్న కథను స్క్రీన్ మీద చూపించాడు. దానికోసం ఎక్కడా మొహమాటపడలేదు. బోల్డ్ జోక్స్ కూడా బాగానే పేల్చాడు. టార్గెటెడ్ ఆడియన్స్ కోసమే వర్జిన్ బాయ్స్ తీసాడని అర్థమవుతుంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఈ వర్జిన్ బాయ్స్.. టార్గెటెడ్ ఆడియన్స్‌కు ఓకే..!