కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు లియో చిత్రబృందానికి షాకిచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 20 వరకు రిలీజ్ చేయోద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగులో తెలుగులో ‘లియో’ టైటిల్‌ను ఉపయోగించడంపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నిర్మాత నాగ వంశీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈనెల 20 వరకు తెలుగులో విడుదలను నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వివాదంపై క్లారిటీ ఇవ్వడానికి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అయితే ముందు నుంచి లియో చిత్రానికి వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందీలో మల్టీప్లెక్స్ సమస్యతో థియేటర్స్ రాలేదు. అటు తమిళనాడులోనూ మార్నింగ్ షోస్ లేవు.. ఇక కన్నడలో అయితే అసలు థియేటర్లే సరిగ్గా దొరకలేదు. ఇప్పుడు తెలుగులోనూ లియో సినిమాకు అడ్డంకి ఏర్పడింది.
మరోవైపు లియో సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించింది. సౌత్ ఇండస్ట్రీలో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ లియో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు భగవంత్ కేసరి సినిమా విడుదల కాబోతున్నా.. లియో బుకింగ్స్ జోష్ మాత్రం తగ్గలేదు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అక్టోబర్ 19న విడుదల కాబోతుంది.
Leo Movieఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అటు విజయ్ దళపతి హీరోగా.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండడంతో ఈ కాంబోను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అడియన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.