Trisha Krishnan: త్రిషకు షాక్ ఇచ్చిన స్టార్ హీరో.. ఆయన చేసిన పనికి అందరూ షాక్..

ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ త్రిష. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో మరోసారి అందం, అభినయంతో కట్టిపడేసింది త్రిష. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్న థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

Trisha Krishnan: త్రిషకు షాక్ ఇచ్చిన స్టార్ హీరో.. ఆయన చేసిన పనికి అందరూ షాక్..
Trisha

Updated on: Apr 25, 2025 | 11:51 AM

స్టార్ హీరోయిన్ త్రిష ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. వరుస సినిమాలతో తెలుగులో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత తమిళ్ సినిమాలతో బిజీ అయ్యింది. తెలుగులో త్రిష ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కాగా ఈ మధ్య కాలంలో త్రిష తమిళ్ సినిమాలకే పరిమితం అయ్యింది. ఇక ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ సి చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. దళపతి విజయ్  గోట్ సినిమాతో పాటు, అజిత్ తో కలిసి రెండు సినిమాలు చేసింది.

రీసెంట్ గా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే త్రిషకు సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్టార్ హీరో త్రిషను అవమానించారని ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్రిషతో ఓ స్టార్ హీరో లిప్ లాక్ చేయను అని చెప్పి షాక్ ఇచ్చాడట ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.

విజయ్ సేతుపతి, త్రిష కలిసి 96 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథలో భాగంగా ఓ లిప్ లాక్ సీన్ ఉందట. అయితే త్రిషతో లిప్ లాక్ కు విజయ్ సేతుపతి నో చెప్పారట. దర్శకుడు చెప్పినా కూడా విజయ్ వద్దు అన్నారట. దాంతో మూవీ టీమ్ అవాక్ అయ్యారట. కథ ఎంతో ఎమోషనల్ గా సాగుతుంది. అలాంటి సినిమాలో లిప్ లాక్ సెట్ కాదు అని ప్రేక్షకులు డిస్ట్రబ్ అవుతారని విజయ్ చెప్పారట. సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న తర్వాత విజయ్ సేతుపతి చెప్పింది నిజమే అని అనుకున్నారట మూవీ టీమ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.