Kaathuvaakula Rendu Kaadhal: ఇద్దరు భామల మధ్య నలిగిపోతున్న విజయ్ సేతుపతి .. ఆకట్టుకుంటున్న టీజర్

తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. సేతుపతి నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి.

Kaathuvaakula Rendu Kaadhal: ఇద్దరు భామల మధ్య నలిగిపోతున్న విజయ్ సేతుపతి .. ఆకట్టుకుంటున్న టీజర్
Vijay Sethupathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2022 | 6:46 AM

Kaathuvaakula Rendu Kaadhal: తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. సేతుపతి నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’. ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లు గా నటిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. విఘ్నేశ్‌ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార, విఘ్నేష్‌లకు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంస్థ, 7 స్ర్కీన్స్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రూపొందించిన స్వరాలు ఇప్పటికే సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను తెలుగులో కణ్మణి రాంబో ఖతిజా పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. లవ్ అండ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి అవస్థలు పడే వ్యక్తిగా సేతుపతి కనిపించారు. ఈ సినిమాలో రాంబోగా విజయ్ సేతుపతి, కన్మణిగా నయనతార, ఖతీజా గా సమంత కనిపించనున్నారు. తొలుత ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం బాగా జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలేనని, తమ చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుంది చిత్రబృందం తెలిపింది. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Alia Bhatt Interview: సంజయ్ సర్ పెట్టిన రూల్‏ను బ్రేక్ చేయాలనుకోలేదు.. ఆలీయా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Bangarraju OTT: బంగార్రాజు సందడి మళ్లీ మొదలవుతుంది.. జీ5 ఓటీటీలో నాగార్జున సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..