Prabhas’s Adipurush: సినిమాలో ఒకేఒక్క సీన్ కోసం ఏకంగా అంత ఖర్చు చేశారట..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ భారీ సినిమాలే. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ భారీ సినిమాలే. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభాస్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే(Pooja Hegde )హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు డార్లింగ్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అటు బాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఇక ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డ నిర్మాతలు రెబల్ స్టార్ చిత్రాలను భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆదిపురుష్ ఇప్పుడు ఆ స్థాయిని కూడా దాటేసి పాన్ వరల్డ్ సినిమాగా పేరు దక్కించుకునేలా కనిపిస్తోంది.
సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే సమయంలో 15 దేశీయ, అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం భారీగా ఖర్చు చేశారట.. ఈ సినిమాలో ఒక కీలక సన్నివేశం కోసం మేకర్స్ ఏకంగా 60 కోట్లు ఖర్చు చేశారట. ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఒక్క సీన్ కోసమే ఇంత ఖర్చు చేశారంటే ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.
మరిన్ని ఇక్కడ చదవండి :