Vijay Deverakonda: మీ అందరి ప్రేమ వల్లే ఈ విజయం.. కింగ్‌డమ్ సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ

కింగ్ డమ్ మూవీ థియేటర్స్ లో దుమ్మురేపుతుంది. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టాడు. అన్ని ఏరియాల నుంచి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. థియేట్సర్ దగ్గర విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Vijay Deverakonda: మీ అందరి ప్రేమ వల్లే ఈ విజయం.. కింగ్‌డమ్ సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ
Kingdom Success Meet

Updated on: Jul 31, 2025 | 6:42 PM

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా  జులై 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొదటి షో నుంచి కింగ్ డమ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సక్సెస్ సెలబ్రేషన్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ సినిమాకి వస్తున్న స్పందన పట్ల మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. యూఎస్ ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రాత్రి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఫోన్ చేసి ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు. మీ అందరి ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది. మీడియా సపోర్ట్ కూడా మరిచిపోలేను. నా తెలుగు ప్రజలు నా వెనుక ఎంత ఉన్నారో నిన్నటి నుంచి చూస్తున్నా. అభిమానులు సినిమా కోసం ఎంతలా మొక్కుకున్నారో, ఎంతలా సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా అన్నారు.

అలాగే ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, మీ ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ విజయాన్ని ప్రేక్షకుల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. తెలుగు ప్రేక్షకులతో పాటు యూఎస్ ఆడియన్స్ ని కూడా త్వరలో కలుస్తాను. గురువారం విడుదలంటే నేను మొదట భయపడ్డాను. కానీ, నాగవంశీ గారు ఈ సినిమా నమ్మి గురువారం విడుదల చేశారు. ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైంది. సినిమాకి నా నటనకు ఇన్ని ప్రశంసలు రావడానికి కారణం దర్శకుడు గౌతమ్. టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్ అన్నకి, అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.