
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్ డమ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మూవీపై మరింత అంచనాలు పెంచేశాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల తమిళ్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా జరిగింది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ కార్యక్రమంలో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంత విజయ్ కామెంట్స్ పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ విజయ్ దేవరకొండపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం స్పందించారు విజయ్. తన ట్విట్టర్ వేదికగా సుధీర్ఘ పోస్ట్ చేస్తూ వివాదానికి పూర్తిగా క్లారిటీ ఇచ్చారు.
విజయ్ తన పోస్టులో… “ఇటీవల రెట్రో మూవీ ఈవెంట్లో నేను చేసిన వాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. నేను వాటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏ వర్గాన్నీ, ఏ తెగను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు.. వారందరినీ నేను ఎంతగానో గౌరవిస్తాను.. భారతదేశంలోని ప్రజలంతా ఒక్కటేనని భావిస్తాను. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా ఉండాలి. నేను ఏ సమూహం పై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబసభ్యులే. నా సోదరులే అని భావిస్తాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉండే క్షమించండి. నేను శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే మాట్లాడాను. ట్రైబ్ అనే పదాన్ని నేను వేరే సెన్స్ లో ఉపయోగించాను. నాగరికత మొదలు కాకముందు క్లాన్స్, రాజ్యాలు అంటూ ఉండేవి. అంతేకానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి కాదు.. 20వ శతాబ్దంలో ఈ ట్రైబ్స్ పదాన్ని పెట్టారు.” అంటూ సుధీర్ఘ వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ నటిస్తోన్న కింగ్ డమ్ సినిమా మే 30న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లలో భాగంగా కింగ్ డమ్ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..