
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ.. ఇటీవలే సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్ధం చాలా సీక్రెట్ గా చేసుకున్నారు. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. మొన్నటివరకు వీరి రిలేషన్ ను చాలా కాలంగా సీక్రెట్ గా ఉంచారు. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి పై ఓ కన్నేసి ఉంచారు.. ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు.
ఈ ఇద్దరూ వెకేషన్స్ కు వెళ్లిన సమయంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా విజయ్, రష్మిక ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ.. కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. తమ్ముడు, కొందరు స్నేహితులతో విజయ్ వెకేషన్ లో ఉన్నట్టు తీ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది. కాగా ఈ ఫొటోల్లో ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ ఫొటోలో విజయ్ దేవరకొండను వెనకనుంచి ఓ అమ్మాయి హగ్ చేసుకొని కనిపిస్తుంది. అయితే ఆమె రష్మిక మందన్ననే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఈ ఇద్దరూ ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంటున్నారు.? అని కొందరు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. మరికొంతమంది ఈ జంటకు విషెస్ తెలుపుతున్నారు. కాగా వీరి వివాహం ఉదయపూర్‌లోని ఒక ప్యాలెస్‌లో జరగనుంది తెలుస్తుంది. ఫిబ్రవరి 26న వీరి పెళ్లి జరగనుందని ఇన్ సైడ్ టాక్. వారి నిశ్చితార్థం మాదిరిగానే, వివాహాన్ని కూడా వీలైనంత సైలెంట్ గా, సీక్రెట్ గా చేసుకోనున్నారని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.