Family Star: ఫ్యామిలీ స్టార్ టీజర్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఖుషి సినిమా యావరేజ్ గా నిలవడంతో విజయ్ నుంచి ఓ సాలిడ్ హిట్ కొట్టాలని ఆశపడుతున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. ఈ క్రమంలోనే విజయ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Family Star: ఫ్యామిలీ స్టార్ టీజర్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..
Family Star

Updated on: Mar 01, 2024 | 3:20 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆయన అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ చూసి చాలా కాలం అయ్యింది. అప్పుడప్పుడే వచ్చిన అర్జున్ రెడ్డి, ఆ తర్వాత గీతగోవిందం సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. వరుసగా విజయ్ దేవరకొండ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఖుషి సినిమా యావరేజ్ గా నిలవడంతో విజయ్ నుంచి ఓ సాలిడ్ హిట్ కొట్టాలని ఆశపడుతున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. ఈ క్రమంలోనే విజయ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో గీతగోవిందం సినిమా వచ్చింది.

గీతగోవిందం సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రానున్న సినిమా పై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమానుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 5, 2024 ఫ్యామిలీ స్టార్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా పై విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు .

ఇదిలా ఉంటే విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఈ సినిమానుంచి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యామిలీ స్టార్ మూవీ టీజర్ గురించి దర్శకనిర్మాతలను అడుగుతున్నారు ఫ్యాన్స్. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ పై అప్డేట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో విజయ్ టీజర్ వస్తుంది అని రాసుకొచ్చాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

విజయ్ దేవరకొండ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.