Prabhas – Vijay devarakonda: ప్రమోషన్స్ స్టంట్స్.. విజయ్ దేవరకొండ ఇలా.. ప్రభాస్ ఏమో దుమ్మురేపేలా
క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని ప్రజలకు చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ హీరోలిద్దరూ ప్రమోషన్లకు వస్తున్నారంటేనే ఫ్యాన్స్‌లో అదో మాదిరి ఇష్టం పెరిగిపోతోంది. ఇంతకీ ఎవరా హీరోలు ? ఏమిటి వారి కథ.. ఖుషీ సినిమాలోని పాటకు స్టేజ్ మీద రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, పర్ఫెక్ట్ బ్యూటీ సమంత వేసిన స్టెప్పుల్ని చూశారుగా.. అదీ సంగతీ! సినిమాకు ఎన్నిరోజుల కాల్షీట్ ఇచ్చి ఎంత ప్రాణం పెట్టి పనిచేసినా, ప్రమోషన్లను కూడా అంతకు ధీటుగానే చేస్తారు విజయ్.
View this post on Instagram
ఆయన సినిమా ప్రేక్షకులకు చేరువయ్యేదాకా భుజాల మీద మోస్తారనే మంచి పేరుంది విజయ్ దేవరకొండకి. ఖుషి కోసం స్టేజ్ మీద బనియన్‌తో కనిపించినట్టు, లైగర్ ప్రమోషన్లలో చెప్పులతో తిరిగారు విజయ్. లైగర్ సినిమా ఫలితం ఆశించినట్టు రాలేదు. అయినా, దిగులుపడుతూ కూర్చోలేదు విజయ్. రెట్టించిన ఉత్సాహంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేశారు. ఖుషి మూవీతో బౌన్స్ బ్యాక్ అవుతాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది విజయ్ దేవరకొండలో. సెప్టెంబర్ 1న విజయ్ ఖుషీతో పలకరిస్తే, సెప్టెంబర్ 28న ప్రేక్షకులకు థియేటర్లలో సందడి పంచడానికి సిద్ధమవుతున్నారు డార్లింగ్ స్టార్ ప్రభాస్.
View this post on Instagram
అప్పుడెప్పుడో బాహుబలి తర్వాత బంపర్ హిట్ లేనే లేదు ప్రభాస్ కెరీర్‌లో. సాహోకి డబ్బులు వచ్చినా అది నార్త్ లో చేసిన సౌండ్, సౌత్‌లో చేయలేదు. అందుకే ఆ తర్వాత విడుదలైన ప్రతి సినిమానూ ఆశగా చూశారు ఫ్యాన్స్. రీసెంట్ రిలీజ్ ఆదిపురుష్ ఈవెంట్‌లోనూ ప్రభాస్‌కి మంచి సపోర్ట్ ఇచ్చారు. మిగిలిన హీరోల్లాగా బోలెడన్ని ఈవెంట్లు చేయడం ప్రభాస్‌కి అలవాటు లేదు. చేసే ప్రమోషన్‌ని ఇంకో రేంజ్‌లో చేయాలనే ధ్యాసే ఉంటుంది.
View this post on Instagram
అందుకే ఒక్క ఫంక్షన్ చేసినా, నెవర్ బిఫోర్ అన్నట్టు ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు సలార్ విషయంలోనూ సేమ్ థీమ్‌ని కంటిన్యూ చేస్తారా.? లేకుంటే బాహుబలి టైమ్‌లో చేసినట్టు రిగరస్‌గా ఇంటరాక్షన్స్ లో పాల్గొంటారా? అనేది అందరికీ ఇంట్రస్టింగ్ విషయం. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సలార్ ప్రమోషన్లు సీరియస్‌గా స్టార్ట్ అవుతాయి. హీరో పార్టిసిపేషన్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేది కూడా అప్పుడే.
View this post on Instagram