Chiranjeevi: ఆ స్టార్ దర్శకుడితో మెగాస్టార్ మూవీ.. జైలర్, విక్రమ్ రేంజ్‌లో మూవీ ప్లాన్

ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు  చిరంజీవి. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలతో అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ సినిమాలను భారీ ఓపినింగ్స్ ఉంటాయి. చిరంజీవి సినిమా అంటే చాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కానీ రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. తాజాగా ఆయన నటించిన భోళాశంకర్ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చింది.

Chiranjeevi: ఆ స్టార్ దర్శకుడితో మెగాస్టార్ మూవీ.. జైలర్, విక్రమ్ రేంజ్‌లో మూవీ ప్లాన్
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 19, 2023 | 12:02 PM

మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. టాలీవుడ్‌లో ఎంత మంది హీరోలు ఉన్న మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ సపరేట్ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు  చిరంజీవి. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలతో అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ సినిమాలను భారీ ఓపినింగ్స్ ఉంటాయి. చిరంజీవి సినిమా అంటే చాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కానీ రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. తాజాగా ఆయన నటించిన భోళాశంకర్ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చింది.

తమిళ్ సినిమాతో పోల్చుకుంటే చాలా మార్పులు చేర్పులు చేశారు మెహర్ రమేష్. భారీ అంచనాలు మధ్య ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మెగాస్టార్ కు సిస్టర్ గా కీర్తిసురేష్ నటించింది. ఈ సినిమా ఫ్లాప్ తో మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా నిరాశ పడ్డారు. ఒక్క సాలిడ్ హిట్ ఇవ్వు బాసు అంటున్నారు.

ఈ క్రమంలోనే చిరంజీవి నెక్ట్స్ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. చిరంజీవి మురగదాస్ దర్శకత్వంలో సినిమా చేయాలనీ చూస్తున్నారట. తమిళ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ జైలర్ తో.. కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ కూడా అదే తరహా యాక్షన్ ఎంటర్టైనర్ తో సినిమా చేసి హిట్ కొట్టి బాస్ ఈస్ బ్యాక్ అనిపించుకోవాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన మురుగదాస్ తో సినిమా చేయాలనీ చూస్తున్నారని టాక్. గతంలో మెగాస్టార్ మురగదాస్ కాంబోలో స్టాలిన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అటు మురగదాస్ శివకార్తికేయన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే మెగాస్టార్ , మురుగదాస్ కాంబో మూవీ ఉంటుందని తెలుస్తోంది’. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!