కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న బిగ్ బాస్ బ్యూటీ
02 December 2024
Rajeev
బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామల్లో దివి ఒకరు. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించి ఆకట్టుకుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో తన అందాలతో పాటు ఆటతోనూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించింది
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. అలాగే రెండు మూడు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసింది ఈ బ్యూటీ.
అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫొటోలతో కట్టుకుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు కుర్రకారుకు కిర్రెక్కిస్తున్నాయి. అందాలు ఆరబోస్తూ కొన్ని క్రేజీ పిక్స్ ను పంచుకుంది