Pushpa 3: పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా ! థియేటర్లు దద్దరిల్లిపోతాయ్‌ !

అల్లు అర్జున్ 'పుష్ప 2.. ది రూల్' గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఎండింగ్ లో 'పుష్ప 3' సినిమా కూడా ఉందని హింట్ ఇచ్చారు. దీంతో ఇప్పటికే ఈ క్రేజీ సీక్వెల్ గురించి పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

Pushpa 3: పుష్ప3లో విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఆ స్టార్ హీరో కూడా ! థియేటర్లు దద్దరిల్లిపోతాయ్‌ !
Pushpa 3 Movie

Updated on: Apr 03, 2025 | 9:13 PM

అల్లు అర్జున్ ‘ పుష్ప 2 ‘ కొన్ని నెలల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా మూడో భాగం కూడా ఉండనుందని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026లో పుష్ప 3 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సీక్వెల్ పై అప్పటికే పలు రూమర్లు వినిపిస్తున్నాయి.  ముఖ్యంగా ‘పుష్ప 3’ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు మరో ఇద్దరు స్టార్ నటులు కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తాజాగా డైరెక్టర్ సుకుమార్ స్వయంగా సమాధానం ఇచ్చారు. ‘పుష్ప 3’ సినిమాలో విజయ్ దేవరకొండ విలన్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ తాజా వార్తల ప్రకారం విజయ్ దేవరకొండ మాత్రమే కాదు న్యాచురల్ స్టార్ నాని కూడా ‘పుష్ప 3’ సినిమాలో విలన్ గా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక కళాశాల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు సుకుమార్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ‘పుష్ప 3’ సినిమా గురించి ఏమైనా చెప్పండని సుకుమార్‌ని అడిగితే.. ‘2025లో సుకుమార్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేడని, 2026లో సుకుమార్ కు ఆ సంగతి తెలుస్తుంది’ అని తెలివిగా సమాధానం ఇచ్చాడీ క్రియేటివ్ డైరెక్టర్.

‘పుష్ప 2’ సినిమా చివర్లో విలన్ ఎంట్రీ ని చూపించిన మేకర్స్ అతని ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. పుష్ప రాజ్ ను చంపడానికి విలన్ పూల గుత్తిలో బాంబును పంపుతాడు. డిటోనేటర్ నొక్కితే పుష్ప ఇంట్లో బాంబు పేలిన దృశ్యం కనిపిస్తుంది. కానీ బాంబు ఎవరు పెట్టారో లేదా బటన్‌ను ఎవరు నొక్కారో మాత్రం చూపించలేదు. ఇది ‘పుష్ప 3’లో తెలుస్తుంది .

ఇవి కూడా చదవండి

 

త్వరలో టీవీలో పుష్ప 2..

పుష్ప 2′ సినిమా తర్వాత, సుకుమార్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే దానిని పక్కన పెట్టేసి విజయ్ దేవరకొండతోనే ‘పుష్ప 3’ సినిమా ను రెడీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

పుష్ప 2 రిలీజ్ .. స్పెషల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.