
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదలైంది. మొదటి రోజునే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ వీకెండ్స్ లోనూ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత విజయ్ ఖాతాలో సూపర్ హిట్ పడడమే కాకుండా హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబడుతుంది. ఖుషి సినిమా హిట్ కావడంతో చిత్రయూనిట్ ఫుల్ సంతోషంగా ఉంది. విడుదలైన మూడు రోజుల్లో ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అటు డైరెక్టర్.. ఇటు సామ్, విజయ్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఖుషి చిత్రయూనిట్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంది. హీరో విజయ్ దేవరకొండతోపాటు మూవీ టీం స్వామి వారిని దర్శించుకుని స్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం అందించి ఆలయ సాంప్రదాయం ప్రకారం ఖుషి చిత్రబృందానికి స్వాగతం పలికారు అర్చకులు. రోజు రోజుకు ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఈ చిత్రం. రెండు రోజుల్లో 50 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించింది. భారీ హైప్‌తో వచ్చిన లైగర్ కంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి ఎక్కువగానే కలెక్షన్స్ వస్తున్నాయి. కేవలం రెండ్రోజుల్లోనే ఈ చిత్రం మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిపోయింది. ఒక్కో హీరో, పెద్ద హీరోకి కూడా మిలియన్ డాలర్ క్లబ్బు చేరేందుకు వారం రోజులు పడుతోంది.
కానీ ఈ సినిమా మాత్రం కేవలం రెండ్రోజుల్లోనే మిలియన్ డాలర్లను రాబట్టేసింది. అటు ఈ సినిమాతో సమంత మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. దక్షిణాదిలో ఇప్పటివరకు ఏ హీరోయిన్‌కు లేని రికార్డ్ అందుకుంది సామ్. ఆమె నటించిన 17 సినిమాలు మిలియన్స్ నటించిన 17 చిత్రాలు మిలియన్ క్లబ్బు చేరాయి. ఇక ఇప్పుడు ఖుషి సినిమాతో సమంత ఖాతాలో ఈ రికార్డ్ వచ్చి చేరిందనే చెప్పుకోవాలి. ఖుషి సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న సామ్ ప్రస్తుతం అమెరికాలో రిలాక్స్ అవుతుంది. మయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లిన సామ్.. సోషల్ మీడియా ద్వారా ఖుషి ప్రచార కార్యక్రమాలు చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.