AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ సర్ ప్రైజ్…మీ ఇంటికే రానున్న విజయ్ దేవరకొండ, మృణాళ్‌.. .. ఏం చేయాలంటే?

శుక్రవారం (ఏప్రిల్ 05) థియేటర్లలోకి అడుగుపెట్టిన ఫ్యామిలీ స్టార్ పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళనాడు ఓవర్సీస్ లోనూ ఫ్యామిలీ స్టార్ మంచి కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా తమ కుటుంబాలకు సపోర్టుగా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్.

Family Star: 'ఫ్యామిలీ స్టార్' సర్ ప్రైజ్...మీ ఇంటికే రానున్న విజయ్ దేవరకొండ, మృణాళ్‌.. .. ఏం చేయాలంటే?
Family Star
Basha Shek
|

Updated on: Apr 06, 2024 | 5:23 PM

Share

‘ఖుషి’ సక్సెస్ తర్వాత టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్. పరశురాం తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో జగపతిబాబు, వెన్నెల కిషోర్, అభినయ, ప్రభాస్ శ్రీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం (ఏప్రిల్ 05) థియేటర్లలోకి అడుగుపెట్టిన ఫ్యామిలీ స్టార్ పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళనాడు ఓవర్సీస్ లోనూ ఫ్యామిలీ స్టార్ మంచి కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా తమ కుటుంబాలకు సపోర్టుగా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ చిత్ర బృందం ప్రేక్షకులకు ఒక బంపరాఫర్ ఇచ్చింది. అదేంటంటే నిజ జీవితంలో ఫ్యామిలీ స్టార్ ను కలుసుకునేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ కు ఒక బంపరాఫర్ ఇచ్చారు. అదేంటంటే..మీ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరు? ఎందుకు? అనే ప్రశ్నలకు సరైన సమాధానం రాయాలి. ఇందుకోసం ఫ్యామిలీ స్టార్ చిత్ర బృందం ఒక ఫామ్ ను కూడా జత చేసింది.

అందులో మీ పేరు, ఇంటి అడ్రస్ తో పాటు మీ ఫ్యామిలీ స్టార్ ఎ‌వరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలి. ఆ తర్వాత చిత్ర బృందం వీటిని పరిశీలించి నిజ జీవితంలోని ఫ్యామిలీ స్టార్లను కలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఫ్యామిలీ స్టార్ చిత్ర బృందం. మరి మీరు విజయ్ దేవరకొండ, మృణాళ్ ను కలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఇంట్లోని ఫ్యామిలీ స్టార్ ఎవరు? ఎందుకు? అన్న వివరాలను జత చేయండి.

ఇవి కూడా చదవండి

ఫ్యామిలీ స్టార్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్