Vijay Devarakonda: ఆ డైరెక్టర్ సినిమాకు నో చెప్పిన చరణ్.. సై అన్న విజయ్‌ దేవరకొండ..!

|

Dec 27, 2022 | 9:09 PM

పాన్ ఇండియన్ హీరోగా మారారనే కారణమో.. స్టోరీ నచ్చలేదనే రీజనో తెలియదు కాని.. చెర్రీ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి తప్పుకున్నారట. ఇక ఆ సినిమా బదులు రంగస్థలం 2 సినిమాను.. దాంతో పాటే బుబ్బి బాబు సనా సినిమాను మొదలెట్టనున్నారట.

Vijay Devarakonda: ఆ డైరెక్టర్ సినిమాకు నో చెప్పిన చరణ్.. సై అన్న విజయ్‌ దేవరకొండ..!
Ram Charan Vijay Devra Kond
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే శంకర్ తో సినిమాతో బిజీగా ఉన్న చెర్రీ.. మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జెర్సీ ఫేం.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు రేపో మాపో షూటింగ్ మొదలెట్టనున్నారు.” ఇది నిన్నమొన్నటి వరకు నెట్టింట వైరల్ అయిన మాటలు. ఇండస్ట్రీ నుంచి కూడా లీకైన కబుర్లు. వీటిని కంటిన్యూ చేస్తూ… ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే ఫ్రెష్ న్యూస్‌లు. ఇక ఇప్పుడేమో.. విజయ్‌ దేవరకొండ చేస్తున్నాడనే కొత్త టాక్‌లు. వెరసి ఇవే ఈ టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

పాన్ ఇండియన్ హీరోగా మారారనే కారణమో.. స్టోరీ నచ్చలేదనే రీజనో తెలియదు కాని.. చెర్రీ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి తప్పుకున్నారట. ఇక ఆ సినిమా బదులు రంగస్థలం 2 సినిమాను.. దాంతో పాటే బుబ్బి బాబు సనా సినిమాను మొదలెట్టనున్నారట. ఇక దీంతో ఈ డైరెక్టర్ చేసేదేం లేక .. చెర్రీకి నరేట్ చేసిన స్టోరీనే వేరే హీరోతో చేయడానికి ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ డేట్స్‌ను లాక్‌ చేశారట. స్టోరీ తనకు కూడా నచ్చడంతో.. వెంటనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట ఈ యంగ్ డైరెక్టర్. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో సక్సెస్ ఇస్తుందో చూడాలి.. మరి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి