విజయ్ దేవరకొండ లాంచ్ చేసిన “మధుర ఒరిజినల్స్” ..
ప్రముఖ మ్యూజిక్ లేబుల్ మధుర ఆడియో "ఇండిపెండెంట్ మ్యూజిక్" రూపొందించడానికి "మధుర ఒరిజినల్స్" అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రముఖ మ్యూజిక్ లేబుల్ మధుర ఆడియో “ఇండిపెండెంట్ మ్యూజిక్” రూపొందించడానికి “మధుర ఒరిజినల్స్” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఇండియా అంతా ఇండిపెండెంట్ మ్యూజిక్ హవా నడుస్తోంది. హిందీ, పంజాబీలో 85 శాతం ఇండిపెండెంట్ మ్యూజిక్ ఉంటే, తెలుగు లో 3 శాతం ఉంది.ఇక్కడ కూడా పంజాబీ సంగీతం లాగా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎదగడానికి భారీ స్కోప్ ఉందని పలువురు సంగీత విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రజాదరణ తెచ్చే లక్ష్యంలో భాగంగా, మధుర ఆడియో యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లు, గాయనిగాయకులకు, గీత రచయితలందరికీ అవకాశాలను కల్పించబోతోంది. ఇప్పటికే 12 మంది యువ సంగీత దర్శకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రముఖ జానపద సింగర్ మంగ్లీతో కలిసి మొదటి ఫోక్ రాప్ సాంగ్ “రాబా రాబా” ను రూపొందించింది. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఈ పాటను ట్విట్టర్‌లో లాంచ్ చేయడం విశేషం.
సాంగ్ పేరు: రాబా రాబా గాయని: మంగ్లి కాన్సెప్ట్ & డైరెక్షన్: ధాము రెడ్డి కొరియోగ్రఫీ: యష్ మాస్టర్ ర్యాప్: మేఘ్-ఉహ్-వాట్ సంగీతం: బాజీ సాహిత్యం: లక్ష్మణ్
Wishing my best and congratulating @madhurasreedhar on his new venture, Madhura Originals.
A platform for independent musicians, singers and lyricists to position their work!
Here is their first Original #RABARABA, a FOLK RAP by @iammangli : https://t.co/a5lTX0kSfA
— Vijay Deverakonda (@TheDeverakonda) July 27, 2020