వెబ్ సిరీస్ వైపు హైబ్రీడ్ పిల్ల అడుగులు

ప్ర‌జంట్ ఓటీటీ ట్రెండ్ న‌డుస్తోంది. కరోనా దెబ్బ‌కు సినిమా ఇండ‌స్ట్రీ అంతా దెబ్బ‌తింది. దీంతో న‌టీన‌టులు దర్శ‌కులు ఓటీటీల‌వైపు చూస్తున్నారు.

వెబ్ సిరీస్ వైపు హైబ్రీడ్ పిల్ల అడుగులు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 27, 2020 | 11:27 PM

ప్ర‌జంట్ ఓటీటీ ట్రెండ్ న‌డుస్తోంది. కరోనా దెబ్బ‌కు సినిమా ఇండ‌స్ట్రీ అంతా దెబ్బ‌తింది. దీంతో న‌టీన‌టులు దర్శ‌కులు ఓటీటీల‌వైపు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలెంటెడ్ న‌టి సాయి ప‌ల్ల‌వి కూడా త్వ‌ర‌లో ఓ వెబ్ సీరిస్ లో న‌టించబోతున్న‌ట్లు స‌మాచారం. అది కూడా జాతీయ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ త‌న‌య పాత్ర‌లో. పరువు హ‌త్య నేప‌థ్యంలో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సీరీస్ నిర్మించ‌నుంద‌ట‌. త‌న పాత్ర‌కు ప్రాధాన్యం ఉండ‌టంతో మ‌రో ఆలోచ‌న లేకుండా సాయి ప‌ల్ల‌వి ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పింద‌ట‌. దీన్ని ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ తెర‌కెక్కించ‌నున్నట్లు స‌మాచారం.

కాగా ప్రస్తుతం సెన్సిటివ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరీ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా విడుద‌ల క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకున్నాక రిలీజ్ చెయ్యాల‌ని యూనిట్ భావిస్తోంది.