సింగర్ సునీతకు కొత్త కష్టం..

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీతకు కొత్త కష్టం వచ్చిపడింది. ఓ వ్యక్తి తన పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మేనల్లుడిని అంటూ..

సింగర్ సునీతకు కొత్త కష్టం..
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 28, 2020 | 12:01 AM

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీతకు కొత్త కష్టం వచ్చిపడింది. ఓ వ్యక్తి తన పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మేనల్లుడిని అంటూ ప్రచారం చేసుకుంటూ.. కొందరి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని సునీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఇంతటి మోసానికి పాల్పడుతున్న చైతన్య అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని అన్నారు. ఇప్పటి వరకు తను చైతన్య అనే వక్తిని కలవను కూడా కలవలేదని స్పష్టం చేశారు. చైతన్య తన పేరు ఉపయోగించుకుని అమాయకులను మోసం చేస్తున్నట్లుగా తెలిసిందని అన్నారు. తనకు చైతన్య అనే అల్లుడు ఎవరూ లేరంటూ ఫేస్ బుక్‌లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.

సెలబ్రేటీల పేరు చెప్పగానే ఎలా డబ్బులు ఇస్తారని.. ప్రతి రోజు మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నా.. ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అయినా కూడా ఎందుకు అలాంటివారిని నమ్ముతారు అంటూ సునీత అసహనం వ్యక్తం చేశారు.

చైతన్య తన అల్లుడు కాదు అని స్వయంగా సునీత చెప్పడంతో బాధితులు పోలీసులుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే 2019లో ‘రాధా’ అనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి ఫోటోలు మార్ఫింగ్ చేసి అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది