అలెర్ట్… విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు..
రుతుపవనాల ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలో ఊహించనంత అధిక వర్షపాతం నమోదవుతుంది.
రుతుపవనాల ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలో ఊహించనంత అధిక వర్షపాతం నమోదవుతుంది. కాగా మంగళవారం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములుతో కూడిన వర్షం కురుస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 45 కిలోమీటర్ల లేదా అంతకంటే ఎక్కువ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. మోస్తారు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రైతులు అరకలు సాగని పరిస్థితి ఏర్పడింది. కలుపు బీభత్సంగా పెరిగిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.