Vijay Antony: లైఫ్‌లో చాలా కోల్పోయా.. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్‌ ఆంటోని

|

Sep 30, 2023 | 8:22 AM

కఠిన పరిస్థితుల్లోనూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు విజయ్‌. తన లేటెస్ట్‌ సినిమా రత్తం సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడీ స్టార్‌ హీరో. తాజాగా చెన్నైలో జరిగిన రత్తం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో చిన్న కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. కుమార్తె మరణానంతరం మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన విజయ్‌ ఆంటోని తన కూతురు మరణంపై మరోసారి స్పందించారు. తన జీవితంలో ఇప్పటికే చాలా కోల్పోయానంటూ ఎమోషనల్‌ అయ్యారు

Vijay Antony: లైఫ్‌లో చాలా కోల్పోయా.. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్‌ ఆంటోని
Vijay Antony
Follow us on

కోలీవుడ్ స్టార్‌ హీరో అండ్‌ డైరెక్టర్‌ విజయ్‌ ఆంటోని కూతురు మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సెప్టెంబర్‌ 19న చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మీరా ఆంటోని ఆత్మహత్యకు పాల్పడింది. మానసిక ఒత్తిడితోనే మీరా బలవన్మరణానికి పాల్పడినట్లు వైద్యులు నిర్ధారించారు. కంటికి రెప్పలా చూసుకున్న కూతురు హఠాన్మరణం చెందడంతో విజయ్‌ ఆంటోనీ కుటుంబ సభ్యులు బాగా కుంగిపోయారు. ఇప్పట్లో ఈ విషాదం నుంచి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇంత కఠిన పరిస్థితుల్లోనూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు విజయ్‌. తన లేటెస్ట్‌ సినిమా రత్తం సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడీ స్టార్‌ హీరో. తాజాగా చెన్నైలో జరిగిన రత్తం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో చిన్న కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. కుమార్తె మరణానంతరం మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన విజయ్‌ ఆంటోని తన కూతురు మరణంపై మరోసారి స్పందించారు. తన జీవితంలో ఇప్పటికే చాలా కోల్పోయానంటూ ఎమోషనల్‌ అయ్యారు. ‘లైఫ్‌ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను జీవితంలో ఇప్పటికే ఎన్నో కోల్పోయాను. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా. బాధల నుంచే నేను చాలా నేర్చుకుంటున్నా’ అని ఆవేదనతో చెప్పారు విజయ్‌.

ఇక రత్తం సినిమా విషయానికొస్తే.. సీఎస్‌ ఆముధన్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించారు. చెన్నైలో సృష్టించిన వరుస హత్యల నేపథ్య కథాంశం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.ప్రముఖ తెలుగు హీరోయిన్‌ నందితా శ్వేతా జర్నలిస్టుగా నటించింది. మహిమా నంబియార్, రమ్య నంబిసన్, ఉదయ్ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్‌, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా రత్తంతో కలిపి సుమారు అరడజను సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్‌ ఆంటోని. అగ్ని సిరుగాల్‌, వాలిమాయ్‌, లవ్‌గురు వంటి క్రేజీ ప్రాజెక్టులో ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్నాయి. తాజాగా హిట్లర్‌ పేరుతో మరో సినిమాను పట్టాలెక్కించాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌.

ఇవి కూడా చదవండి

హిట్లర్ గా రానున్న విజయ్ ఆంటోని..

 తిరుమలలో విజయ్ ఆంటోని..

రత్తం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.