Salaar Movie: అటు హ్యాపీ.. ఇటు షాక్‌లో డార్లింగ్ ఫ్యాన్స్.. వచ్చేసిన ‘సలార్’ కొత్త రిలీజ్ డేట్.!
అదేంటో..! ఎట్ ప్రజెట్ ఓ అలౌకిక స్థితిలో .. కొట్టుమిట్టాడుతున్నారు రెబల్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్. ఎందుకంటే..! ఎప్పడో అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్.. పోస్ట్ పోన్ అవడం..! ఆ తరువాత ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలిమని అయోమయం! ఆవెంటనే కుప్పలు తెప్పలుగా వచ్చిన రిలీజ్ డేట్ గాలి వార్తల ప్రభంజనం! కట్ చేస్తే..
అదేంటో..! ఎట్ ప్రజెంట్ ఓ అలౌకిక స్థితిలో .. కొట్టుమిట్టాడుతున్నారు రెబల్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్. ఎందుకంటే..! ఎప్పుడో అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్.. పోస్ట్ పోన్ అవడం..! ఆ తరువాత ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలిమని అయోమయం! ఆ వెంటనే కుప్పలు తెప్పలుగా వచ్చిన రిలీజ్ డేట్ గాలి వార్తల ప్రభంజనం! కట్ చేస్తే.. డిసెంబర్ 22నే సినిమా రిలీజ్ అంటూ.. బయటికి వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ యవ్వారం! దీంతోనే..! అటు సంతోషంలోనూ.. ఇటు షాక్లోనూ.. స్టక్ అయి కూర్చున్నారు చాలామంది డార్లింగ్ ఫ్యాన్స్.
ఆఫ్టర్ సాహో.. రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మొదలెట్టిన సినిమా సలార్. కరోనా ముందే ముహూర్తపు వీడియోతో.. తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అయిన ఈ సినిమా.. అప్పటి నుంచి షూటింగ్ ఫేజ్‌లోనే కంటిన్యూ అవుతూ వస్తోంది. మధ్య మధ్యలో ఈ మూవీ షూటింగ్ సెట్టు నుంచి వచ్చే.. లీకులతో.. జనాల నోళ్లలో నానుతూ.. మోస్ట్ అవైటెడ్ మూవీ అనే టాక్‌ను తెచ్చుకుంది.
ఇక ఆ క్రమంలోనే ప్రభాస్ బర్త్ డే రోజు రిలీజ్ అయిన టీజర్.. అటు ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ.. ఇటు ఫిల్మ్ లవర్స్‌లోనూ ఎక్కడ లేని హైప్‌ను తీసుకొచ్చింది. ప్రభాస్‌ను ఏకంగా డైనోసార్‌లా పోట్రే చేసింది. దీంతో నెట్టింట ప్రభాస్ అలియాస్ డైనోసార్ అనే ట్యాగే వైరల్ అవడం మొదలైంది. దాంతో పాటే.. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న సలార్ కోసం ఫ్యాన్స్‌ను ఈగర్గా వెయిట్ చేసేలా చేసింది.
కానీ ఉన్నట్టుండి సలార్ సినిమా రిలీజ్ అగిపోయింది. సలార్ గ్రాఫిక్స్ అవుట్ పుట్‌పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సాటిఫై అవ్వని కారణంగా.. ఈ సినిమా రిలీజ్ ఆగిపోయిందనే టాక్ బయటికి వచ్చింది. ఇక ఆరోజు నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు.. తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చింది హోంబలి నిర్మాణ సంస్థ. ఆ సినిమా రిలీజ్ డేట్ అందరూ అనుకుంటున్నట్టు.. డిసెంబర్ 22 అంటూ.. ఓ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో బ్లడ్ షవర్‌లో తడిచినట్టు ఉన్న ప్రభాస్ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ.. మళ్లీ ఈ సినిమా బజ్‌ను నెట్టింట పీక్స్‌లోకి తీసుకెళ్లింది.
– సతీష్ చంద్ర(ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..