'సలార్‌' ఊచకోత.. గూస్‌ బంప్స్‌ పుట్టిస్తున్న న్యూ లుక్‌.. బాక్సాఫీస్‌కు ఊపిరి పీల్చుకో.!

‘సలార్‌’ ఊచకోత.. గూస్‌ బంప్స్‌ పుట్టిస్తున్న న్యూ లుక్‌.. బాక్సాఫీస్‌కు ఊపిరి పీల్చుకో.!

Ravi Kiran

|

Updated on: Sep 30, 2023 | 8:55 AM

నిన్న మొన్నటి వరకు బొగ్గు కుప్పల మధ్య కనిపించిన ప్రభాస్‌నే చూసుంటారు. ఊచకోత కోసేందుకు రెడీగా ఉన్న ప్రభాస్‌ ఫోటోనే విట్‌నెస్ చేసి ఉంటారు. కానీ ఆ పోరాటం కారణంగా.. రక్తంతో తడిచిన అతడి దేహాన్ని చూశారా..? వేల మందిని ఊచకోత కోసిన.. అతడి కత్తిని చూశారా? ఆ కత్తి పట్టిన పిడికిలిని చూశారా.? ఓసారి లుక్కేయండి..

నిన్న మొన్నటి వరకు బొగ్గు కుప్పల మధ్య కనిపించిన ప్రభాస్‌నే చూసుంటారు. ఊచకోత కోసేందుకు రెడీగా ఉన్న ప్రభాస్‌ ఫోటోనే విట్‌నెస్ చేసి ఉంటారు. కానీ ఆ పోరాటం కారణంగా.. రక్తంతో తడిచిన అతడి దేహాన్ని చూశారా..? వేల మందిని ఊచకోత కోసిన.. అతడి కత్తిని చూశారా? ఆ కత్తి పట్టిన పిడికిలిని.. ఆ కత్తి కంటే.. పదునైన అతడి చూపును.. చూశారా? చూడలేదా.. అయితే మరొక్కసారి తాజాగా రిలీజ్ అయిన సలార్‌ పోస్టర్‌ను చూడండి! బ్లడ్‌ షవర్‌ ఫీలింగ్‌ ఏంటో మీకే విట్ నెస్ అవుతుంది.

ఓ సినిమా రిలీజ్‌కు ముందు.. ఆ సినిమా నుంచి బయటికి వచ్చే.. ఫోటోలు.. పోస్టర్లు.. టీజర్లు.. ట్రైలర్లు.. ఆ సినిమాపై హైప్‌ పెంచేందుకే ఉపయోగపడతాయి. ఆ సినిమా కంటెంట్‌ను చెప్పకనే చెబుతూ.. సినిమాపై ఎక్కడలేని అంచనాలను పెంచుతాయి. ఇక సలార్‌ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు.. పర్ఫెక్ట్‌ గా ఇదే చేశాయి. సలార్‌ పై అందర్లో ఆకాశాన్నంటే అంచనాలను పెంచేశాయి.

ఇక అందులో.. సలార్ మూవీ డిసెంబర్ 22 న రిలీజ్‌ అవుతుందంటూ.. అప్పటి వరకు ఉన్న సైలెంట్‌ను బ్రేక్ చేసిన ఈ మూవీ టీం…. ఆ క్రమంలోనే.. ప్రభాస్‌ మరో లుక్‌ను బయటికి వదిలింది. ఇక ఆ లుక్‌లో ప్రభాస్‌.. రక్తంతో తడిచి ఉండడం.. ఈసినిమాలో ఏ రేంజ్‌ యాక్షన్ ఉందో.,. తెలిసేలా చేస్తోంది. డైనోసార్‌ రేంజ్‌ ఫైట్స్‌ ఖాయం అనే హింట్ రెబల్ ఫ్యాన్స్‌కు ఇచ్చింది. అందర్లో గూస్‌ బంప్స్‌ పుట్టిస్తూ.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

– సతీష్ చంద్ర(ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 30, 2023 08:25 AM