Chhaava: రష్మిక కొత్త సినిమా టీజర్ వచ్చేసింది.. అల్లు అర్జున్ పుష్ప2కు పోటీగా దింపారుగా

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాంబాజీగా విక్కీ కౌశల్, అతని భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక మందన్న యాక్ట్ చేస్తున్నారు

Chhaava: రష్మిక కొత్త సినిమా టీజర్ వచ్చేసింది.. అల్లు అర్జున్ పుష్ప2కు పోటీగా దింపారుగా
Chhaava Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 19, 2024 | 1:43 PM

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. అలాగే చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖల జీవిత కథలను కూడా తెరమీద ఆవిష్కరిస్తున్నారు.అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, అజయ్ దేవగన్ ‘తానాజీ’, ‘పానిపట్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇప్పుడు మరో హిస్టారికల్ సినిమా రాబోతుంది. అదే విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి సాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాంబాజీగా విక్కీ కౌశల్, అతని భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక మందన్న యాక్ట్ చేస్తున్నారు. వీరితో పాటు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఛావా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో వందలాది మంది శత్రువులతో పోరాడే యుద్ధ వీరుడు సాంబాజీ పాత్రలో అదరగొట్టాడు విక్కీ. అలాగే రష్మిక మందన్నా ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం థియేటర్లలో ‘స్త్రీ 2’ సినిమా సందడి చేస్తోంది. ఈ సినిమాతో పాటు ‘ఛవ్వా’ సినిమా టీజర్ ను కూడా జత చేశారు.

చాలా మంది ఛావాలో విక్కీ కౌశల్ పాత్రను బాజీరావ్ మస్తానీ సినిమాలోని రణవీర్ సింగ్ తో పోలుస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న గ్రాండ్ గా విడుదల కానుంది. అదే రోజున రష్మిక మందన్న నటించిన మరో పాన్ ఇండియా ‘పుష్ప 2’ కూడా విడుదల కానుంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు విడుదల కావడం విశేషం. ‘మిమి’, ‘చుప్పి’ చిత్రాల దర్శకుడు లక్ష్మణ ఉటేకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విక్కీ కౌశల్, లక్ష్మణ్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జరా హాట్కే జరా బచ్కే’లో సినిమా వచ్చింది. 2023లో విడుదలైన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఆడియెన్స్ ను అలరించింది. ఇప్పుడీ కాంబో రిపీట్ అవ్వడంతో ఛావా సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు

ఇవి కూడా చదవండి

 చావా సినిమా టీజర్ ఇదిగో..

విక్కీ కౌశల్ తో రష్మిక మందన్నా…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.