Superstar Krishna: కృష్ణ 57 ఏళ్ల సినీ కెరీర్ లో 50 ఏళ్లు కలిసి ప్రయాణం చేశానంటున్న సీనియర్ నటుడు గిరిబాబు

కృష్ణ మరణం తనకు తీరని లోటని, ఈ వార్త తనకు అంతులేని బాధను కలిగించిందని సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబు అన్నారు. బాపట్లజిల్లా రావినూతలలోని ఆయన స్వగ్రామంలో గిరిబాబు కృష్ణమృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Superstar Krishna: కృష్ణ 57 ఏళ్ల సినీ కెరీర్ లో 50 ఏళ్లు కలిసి ప్రయాణం చేశానంటున్న సీనియర్ నటుడు గిరిబాబు
Giri Babu Super Star Krishn

Updated on: Nov 15, 2022 | 2:04 PM

సూపర్‌స్టార్‌ కృష్ణ మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్ణ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. కొంతమంది సినీ నటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కృష్ణతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు కృష్ణ మరణం తనకు తీరని లోటని, ఈ వార్త తనకు అంతులేని బాధను కలిగించిందని సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబు అన్నారు. బాపట్లజిల్లా రావినూతలలోని ఆయన స్వగ్రామంలో గిరిబాబు కృష్ణమృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణతో విజయనిర్మల నిర్మించిన 40 చిత్రాల్లో కూడా తాను నటించానని, అలాగే కృష్ణ దర్శకత్వం వహించిన సింహాసనం, కొడుకు దిద్దిన కాపురం వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించానని తెలిపారు. లెజండరీ నటులు ఎన్‌టిఆర్‌, ఏఎన్‌ఆర్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ చనిపోవడం సినిమా పరిశ్రమకు తీరనిలోటుగా మిగిలిపోతుందన్నారు.. తన యాభై ఏళ్ళ కెరీర్‌లో కృష్ణతో సినిమా లేకుండా ఉండలేదన్నారు. కృష్ణ మృతి తనను ఎంతోబాధించిందని గిరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢసానుభూతి తెలియచేస్తున్నానన్నారు.
Reporter: Fairoz , Tv9 Telugu

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..