తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లోకేష్ యాక్షన్ కథలకు ఫేమస్. లోకేష్ ఎల్‌సీయూలో భాగంగా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు ఎల్‌సీయూలో భాగంగా వచ్చాయి.. ఇప్పుడు మరికొన్ని సినిమాలు కూడా రానున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు లోకేష్. ఈ సినిమా తొలి దశ షూటింగ్ చెన్నై, కర్ణాటకలో జరగగా. మిగిలిన భాగం ఉత్తరాది రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత లోకేష్ నిర్మాతగా మారాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ నటిస్తున్న బెంజ్ చిత్రాన్ని లోకేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్నిఎల్‌సీయూలో కలపబోతున్నట్లు లోకేష్ చెప్పాడు. భాగ్యరాజ్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు యువ గాయకుడు సాయి అభయంకర్‌ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు లోకేష్. అలాగే ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషించడానికి ఒక ప్రముఖ నటుడిని ఎంచుకున్నాడు లోకేష్. ఆయన మరెవరో కాదు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.
విక్రమ్ సినిమాలో సూర్య ను విలన్ గా చూపించాడు లోకేష్. రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే ఇప్పుడు తెరకెక్కిస్తున్న కూలి సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని అంటున్నారు. అలాగే బెంజ్ సినిమాలో మాధవన్ ను విలన్ గా సెలక్ట్ చేశాడని తెలుస్తుంది. ఒకప్పుడు లవర్ బాయ్ గా అలరించిన మాధవన్.. ఈ మధ్య మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విక్రమ్‌లో, నటుడు సూర్య విలన్‌గా “రోలెక్స్” పాత్రను పోషించాడు. ఆ క్యారెక్టర్ లాగే బెంజ్ సినిమాలో కూడా నటుడు మాధవన్ మెయిన్ విలన్‌గా నటించనున్నాడని సమాచారం. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.