AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: పెదరాయుడి ఇంట విభేదాల వేళ.. మంచు లక్ష్మి పోస్ట్ వైరల్

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు రోజుల క్రితం చిన్నగా మొదలైన ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది.

Manchu Lakshmi: పెదరాయుడి ఇంట విభేదాల వేళ.. మంచు లక్ష్మి పోస్ట్ వైరల్
Manchu Lakshmi
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2024 | 5:04 PM

టాలీవుడ్ పెదరాయుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం (డిసెంబర్ 08) తో మొదలైన ఈ గొడవ మంగళ వారం (డిసెంబర్ 10) రాత్రి నాటికి ఉద్రిక్త స్థాయికి చేరుకుంది. మంచు మనోజ్ దంపతులను లోపలికి రాకుండా సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఇక ఈ విషయంపై సమాచారం తెలుసుకునేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం సంచలనంగా మారింది. జర్నలిస్టు సంఘాల యూనియన్లు, నాయకులతో పాటు పలువురు రాజకీయ నాయకులు మోహన్ బాబు తీరును ఖండిస్తున్నారు. కాగా మంచు ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతుంటే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాత్రం సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గొడవ విషయం తెలుసుకున్న ఆమె ఆదివారం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ప్రస్తుతం మంచువారమ్మాయి ముంబైలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మంచు లక్ష్మి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను షేర్‌ చేస్తూ దానికి పీస్‌ (శాంతి) అని క్యాప్షన్ ఇచ్చింది. దీనిని చూస్తే శాంతించండి అంటూ ఇన్‌డైరెక్ట్‌గా మంచు లక్ష్మి సలహా ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్‌ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

అంతకు ముందు తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఒక వీడియోను షేర్ చేసింది మంచు లక్ష్మి. దీనిని బట్టి ఆమె హైదరాబాద్ లో లేదని తెలుస్తోంది. కాగా చాలా రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి ముంబైలోనే సెటిలైనట్లు తెలుస్తోంది. అయితే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో యాక్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ముంబైలో అవకాశాలు ఇంకా ఎక్కువగా దొరుకుతాయంటోంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది మంచు వారమ్మాయి. తన డైలీ రొటీన్‌, ఫిట్‌నెస్‌ విషయాలతోపాటు కుమార్తె విద్యా నిర్వాణకు సంబంధించిన విశేషాలను అందులో షేర్ చేస్తూ ఉంటుంది.

మంచు లక్ష్మి  షేర్ చేసిన పోస్ట్ ఇదే..

కూతురిలో కలిసి మంచు లక్ష్మి డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?