Fahadh Faasil: అందుకే నేను హిందీ సినిమాల్లో నటించడం లేదు.. అసలు విషయం చెప్పిన ఫహద్ ఫాజిల్

మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ఫహద్ ఫాజిల్. అయితే ఫహద్ ఫాజిల్ ఇంతవరకు బాలీవుడ్ లో నటించలేదు. తమిళ్ స్టార్ హీరోలు చాలా మంది ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతిలాంటి నటులు కూడా హిందీలో సినిమాలు చేస్తున్నారు.

Fahadh Faasil: అందుకే నేను హిందీ సినిమాల్లో నటించడం లేదు.. అసలు విషయం చెప్పిన ఫహద్ ఫాజిల్
Fahadh Faasil

Updated on: May 08, 2024 | 10:37 AM

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మలయాళ స్టార్ట్ హీరో.. మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ఫహద్ ఫాజిల్. అయితే ఫహద్ ఫాజిల్ ఇంతవరకు బాలీవుడ్ లో నటించలేదు. తమిళ్ స్టార్ హీరోలు చాలా మంది ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. విజయ్ సేతుపతిలాంటి నటులు కూడా హిందీలో సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఫహద్ ఫాజిల్ హిందీలో నటించకపోవడానికి కారణం చెప్పాడు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ ఈ విషయాన్ని తెలియజేశాడు .

ఫహద్ ఫాసిల్ మొదటి నుంచి మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా పరభాషే చిత్రాలైన ‘సూపర్ డీలక్స్’, ‘విక్రమ్’, ‘పుష్ప’ చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. పుష్ప సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అంతకుముందు అతనికి హిందీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ సినిమాల్లో నటించలేదు ఫహద్ ఫాజిల్.  దీని పై ఆయన మాట్లాడుతూ..  ఐదారు సంవత్సరాల క్రితం. నన్ను సంప్రదించిన తొలి హిందీ చిత్రానికి ఓకే చెప్పాను. అయితే స్క్రిప్ట్‌ని ఫైనల్ చేయలేకపోయాను. ఆ తర్వాత దర్శకుడు మరొకరిని ఎంచుకున్నాడు. నేను సినిమా నుంచి బయటకు వచ్చాను. హిందీలో సీరియస్ గాని, కరెక్ట్ గాని కథేమీ దొరకలేదు’ అని ఫహద్ ఫాసిల్ అన్నారు.

‘నాకు హిందీ బాగా రాదు. కానీ నేను హిందీ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తెలుగు, తమిళ సినిమాలు చేశాను. హిందీ కూడా చేస్తాను. కానీ, ఎప్పుడొస్తుందో తెలీదు’ అని చెప్పుకొచ్చాడు ఫహద్ ఫాజిల్. కరణ్‌ జోహార్‌, విక్కీ కౌశల్‌తో నాకు మంచి స్నేహం ఉంది. కరణ్ జోహార్ నా సినిమాలను చూస్తాడు. అలాగే వాటిలో తనకు నచ్చిన వాటి గురించి నాకు చెప్తూ ఉంటాడు’ అని ఆయన అన్నారు. ఫహద్‌ ఫాసిల్‌ నటించిన ‘ఆవేశం’ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్‌ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.