Venu Swamy: నాగచైతన్య- శోభితలపై వ్యాఖ్యలు.. వేణు స్వామికి ఝలక్ ఇచ్చిన హైకోర్టు

|

Oct 28, 2024 | 2:33 PM

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నారు. ఇప్పటికే శోభిత ఇంట్లో ప్రీ వెడ్డింగ్ పనులు కూడా మొదలయ్యాయి. ఇటీవల పసుపు దంచే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపిందీ అందాల తార.

Venu Swamy: నాగచైతన్య- శోభితలపై వ్యాఖ్యలు.. వేణు స్వామికి ఝలక్ ఇచ్చిన హైకోర్టు
Naga Chaitanya, Sobhita Dhulipala, Venu Swamy
Follow us on

ఈ ఏడాది ఆగస్టులో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నాగచైతన్య-శోభిత ల ఎంగేజ్ మెంట్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు నాగార్జున. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నాగ చైతన్య-శోభితలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అయితే అదే సమయంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఈ జంటపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సమంత – చైతన్య విడిపోయినట్లే నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పాడు. వేణు స్వామి వ్యాఖ్యలు వైరల్ కావడంతో అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శోభిత, సమంతల మీద కామెంట్స్ చేసినందుకు గానూ వేణు స్వామిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ . ఈ మేరకు మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పింది.

అయితే వేణుస్వామి మాత్రం మహిళా కమిషన్ కు తనను విచారించే అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం వేణుస్వామిపై చర్యలు తీసుకోవద్దంటూ మహిళా కమిషన్ ను ఆదేశించింది. ఇప్పుడు ఇదే విషయంలో వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తి వేస్తూ వేణస్వామిని విచారించేందుకు మహిళా కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని తెలిపింది. వారంలోగా వేణుస్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు హైకోర్టు స్పష్టం చేసింది. మరి వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హాజరవుతారా? లేదా? మరో పిటిషన్ వేస్తారా? అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

కాగా ఇటీవల వేణు స్వామి వ్యక్తి గత జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన పరాంకుశం విజయ లక్ష్మి అక్టోబర్ 04న కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వామీజీనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మా అమ్మ గారు శ్రీమతి పరాంకుశం విజయ లక్ష్మి గారు  పరమపదించారు (మరణించారు)’ అంటూ సోషల్ మీడియాలో తన తల్లి ఫొటోను షేర్ చేశారు వేణు స్వామి. ఇక ఇటీవల ద్వాదశ దినకర్మ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

వేణు స్వామి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

తల్లి ద్వాదశ దినకర్మ కార్యక్రమాల్లో వేణు స్వామి..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.