F3 Movie: స్పీడ్ పెంచనున్న వెంకీ- వరుణ్.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సింగిల్ షెడ్యూల్‌లోనే ..
సీనియర్ హీరో వెంకటేష్ కుర్రహీరోలతో కలిసి మల్టీస్టార్ సినిమాలు చేస్తూనే.. మరోపక్క సోలో హీరోగానూ చేస్తూ వాళ్ళకే పోటీ ఇస్తున్నారు వెంకీ.
F3 Movie: సీనియర్ హీరో వెంకటేష్ కుర్రహీరోలతో కలిసి మల్టీస్టార్ సినిమాలు చేస్తూనే.. మరోపక్క సోలో హీరోగానూ చేస్తూ వాళ్ళకే పోటీ ఇస్తున్నారు వెంకీ. ఇటీవలే నారప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో మరోసారి నవ్వులు పూయించాడని రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ .. మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రెస్టేషన్ అనే అనే కాసెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కామెడీ ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఎఫ్ 3 సినిమా రాబోతుంది. ఈ సినిమాకు కూడా అనిల్ రావిపూడినే దర్శకత్వం వహిస్తున్నాడు. మరోసారి వెంకీ.. వరుణ్‌లతో కలిసి థియేట్సర్స్‌లో నవ్వులు కురిపించాడు రెడీ అవుతునాడు అనిల్.
అయితే ఈ సినిమాలో వెంకీ- వరుణ్‌లతోపాటు సునీల్ కూడా నటిస్తున్నారు. సునీల్ కూడా యాడ్ అవ్వడంతో కామెడీ డోస్ మరింత పెంచేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరపాలని చిత్రయూనిట్ భావించినప్పటికీ కరోనా దానికి బ్రేక్ వేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను తిరిగి పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. F3 షూటింగ్ అక్టోబర్ మొదటి వారం నుండి ప్రారంభమవుతుంది. మిగిలిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేయాలని చూస్తున్నారట టీమ్. త్వరలోనే హైదరాబాద్‌లోని ఫలక్ నమా ప్యాలెస్‌లో షూటింగ్ చేయనున్నారని తెలుస్తుంది. పెండింగ్‌లో ఉన్న చాలా భాగం షూటింగ్ ఫలక్ నమా ప్యాలెస్‌లోషూట్ చేయనున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :