Venkatesh: సినిమా గ్యారెంటీ హిట్ అని అక్కడే తెలిసిపోయింది.. వెంకటేష్ కామెంట్స్

|

Jan 11, 2025 | 5:59 PM

విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఎఫ్2, ఎఫ్ 3 సినిమాల తర్వాత వెంకీ, అనిల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.

Venkatesh: సినిమా గ్యారెంటీ హిట్ అని అక్కడే తెలిసిపోయింది.. వెంకటేష్ కామెంట్స్
Sankranthiki Vasthunnam
Follow us on

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొలాబరేషన్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో విక్టరీ వెంకటేష్ విలేకరుల సమావేశంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ విశేషాల్ని పంచుకున్నారు.

ఓ మై చంద్రముఖి..! ఈ స్టార్ హీరోయిన్ గురువుగారి భార్య..!! ఇది మాములు ట్విస్ట్ కాదు

నా కెరీర్ ఇది మరో సంక్రాంతి. ఒక క్లీన్ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ తో రావడం చాలా ఆనందంగా వుంది. లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా వుంది. సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అంతా పాజిటివ్ గా వుంది. నా కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన మోస్ట్ ఫిలిమ్స్ చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం వుంది. ఈసారి ప్రమోషన్స్ చాలా ఎనర్జిటిక్ గా  చేయడం నేచురల్ గా జరిగింది. మ్యూజిక్ చాలా నచ్చింది. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. కొన్ని మ్యూజిక్ ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లైవ్లీ టీం కుదిరింది. ప్రమోషన్స్ లో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. ప్రమోషన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేయడం హ్యాపీగా వుంది అన్నారు వెంకటేష్.

సినిమా అట్టర్ ప్లాప్.. స్టార్ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్

నైట్ రెండు గంటలకి సంక్రాంతి సాంగ్ విన్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. ఎదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్ లో వుంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే వుంది. ఇంగ్లీష్ వర్డ్స్ వుండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది(నవ్వుతూ). ఇందులో రమణ గోగుల గారు పాడిన పాట పెద్ద హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాడారు. పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది అని అన్నారు వెంకటేష్. అలాగే కథ విన్నప్పుడు ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్ గా అనిపించింది. మినిమం గ్యారెంటీ అని అక్కడే తెలిసిపోయింది. అనిల్ నాది సూపర్ హిట్ కాంబినేషన్. మేము చాలా ఫ్రెండ్లీగా వుంటాం. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇందులో కామెడీ స్టయిల్ కొంచెం డిఫరెంట్ గా వుంటుంది. చాలా సటిల్ గా కొత్తగా ట్రై చేశాం. ఫ్రెష్ సీన్స్ వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. అనిల్ తో మంచి రాపో కుదిరింది. తనతో మూవీస్ కంటిన్యూ చేయాలని వుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి