Chiranjeevi-Venkatesh: వెంకటేష్ చేయాల్సిన సినిమాను మెగాస్టార్ చేసి హిట్ కొట్టేశారు.. ఆ మూవీ ఏంటో తెలుసా..?
చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకున్నారు. అటు బాలయ్య వీరసింహారెడ్డి తో అలరించారు. వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నారు. నాగార్జున కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నారు.
సీనియర్ హీరోల ఇప్పటికి కుర్ర హీరోలతో పడుతూ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఎవరి సినిమాలతో వారు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకున్నారు. అటు బాలయ్య వీరసింహారెడ్డి తో అలరించారు. వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నారు. నాగార్జున కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ నాలుగు హీరోలు ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. అయితే వెంకటేష్ నటించాల్సిన సినిమాను చిరంజీవి చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇంతకు ఆ సినిమా ఏంటో తెలుసా..
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో మున్నా బాయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో సంజయ్ దత్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమాను తెలుగులో శంకర్ దాదా అనే టైటిల్ తో చిరంజీవి రీమేక్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి నటన. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిరు.
అయితే ఈ సినిమా ముందు వెంకటేష్ చేయాలనుకున్నారట. మున్నా బాయ్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఫ్యాన్సీ రేటుకి ఆల్ ఇండియన్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెడదాం అనుకునేలోగా.. ఏం జరిగిందో తెలియదు హీరో, నిర్మాత, డైరెక్టర్ అందరూ మారిపోయారు. అదే సినిమాను చిరంజీవి రీమేక్ చేసి హిట్ కొట్టేశారు.