AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: వరుణ్‌ తేజ్‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? మూడు నెలల కొడుకు కోసం ఏం చేశాడో చూశారా? వీడియో

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి దంపతులు ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 10న లావణ్య ఓ పండంటి మగబిడ్డకు జ‌న్మినిచ్చిన సంగ‌తి తెలిసిందే. తమ కుమారుడికి వాయువ్ తేజ్ అని పేరు పెట్టుకున్నారు వరుణ్- లావణ్య దంపతులు

Varun Tej: వరుణ్‌ తేజ్‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? మూడు నెలల కొడుకు కోసం ఏం చేశాడో చూశారా? వీడియో
VarunTej, Lavanya Tripathi
Basha Shek
|

Updated on: Dec 16, 2025 | 12:03 AM

Share

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు తమ కుమారుడి ఆలనా పాలనతో బిజీగా ఉన్నారు. 2023లో వీరిద్ద‌రి వివాహం జరగ్గా, ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 10న వీరికి ఓ పండంటి మగబిడ్డ జన్మించాడు. కొణిదెల ఫ్యామిలీకి ఇష్ట దైవ‌మైన హ‌నుమంతుడి పేరు వ‌చ్చేలా తమ కుమారుడికి వాయువ్ తేజ్ కొణిదెల అని పేరు పెట్టారు వరుణ్– లావణ్య. కాగా వాయువ్ తేజ్ పుట్టి మూడు నెల‌లు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా ఈ దంపతులు త‌మ కొడుకు మూడో నెల బ‌ర్త్ డే ను మ‌రింత స్పెష‌ల్ గా సెల‌బ్రేట్ చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడి కోసం వరుణ్ తేజ్ నే స్వయంగా ఓ బుజ్జి కేకును తయారు చేశాడు. దానిపై ఓ వినాయకుడి చిత్ర పటాన్ని ముద్రించి ఎంతో మంచి డిజైన్ తో కేక్ రెడీ చేశాడు. అనంతరం ఈ బుజ్జి కేకుతో సరదాగా ఫొటోలు వరుణ్ – లావణ్య దంపతులు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అయితే ఈ వీడియోలో కూడా త‌మ కొడుకు ఫేస్ ను మాత్రం ఎక్కడా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు వ‌రుణ్, లావ‌ణ్య‌ దంపతులు.

ఇక సినిమాల విషయానికి వస్తే..  ఈ మధ్యన వరుణ్ తేజ్ చిత్రాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. ముఖ్యంగా అతను నటించిన చివరి సినిమా మట్కా భారీ అంచనాల మధ్య రిలీజై అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు బాగా ట్రై చేస్తున్నాడీ మెగా హీరో. ఇందులో భాగంగానే ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజ్’ అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నాడు వరుణ్. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లావణ్య త్రిపాఠి అధర్వ మురళితో కలిసి నటించిన ‘టన్నెల్’ మూవీ ఈ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.

ఇవి కూడా చదవండి

కుమారుడి కోసం కేకు తయారు చేస్తోన్న వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి.. వీడియో..

ఉపాసన సీమంతంలో వరుణ్ తేజ్ -లావణ్య దంపతులు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..