Varun Tej: ప్రెగ్నెంట్‌ భార్య కోసం చెఫ్‌గా మారిన వరుణ తేజ్.. లావణ్యకు ప్రేమగా ఏం వండిపెట్టాడో తెలుసా? వీడియో

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఇటీవల శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో తాము అమ్మానాన్నలం కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. దీంతో గర్భంతో ఉన్న తన భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు వరుణ్.

Varun Tej: ప్రెగ్నెంట్‌ భార్య కోసం చెఫ్‌గా మారిన వరుణ తేజ్.. లావణ్యకు ప్రేమగా ఏం వండిపెట్టాడో తెలుసా? వీడియో
Varun Tej, Lavanya

Updated on: May 16, 2025 | 3:21 PM

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందు చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. పెద్దలను ఒప్పించి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. 2023 నవంబర్ లో ఇటలీ వేదికగా వరుణ్ తేజ్, లావణ్యల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఇప్పుడ తమ ప్రేమ బంధానికి ప్రతీకగ ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ లవ్లీ కపుల్. లావణ్య ప్రస్తుతం గర్భంలో ఉంది. త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డను ప్రసవించనుంది. ఈ శుభవార్తను ఇటవలే సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారీ మెగా కపుల్. లావణ్య ప్రస్తుతం గర్భంతో ఉండడంతో ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు వరుణ్. భార్య కోసం కొన్ని స్పెషల్ కేర్స్ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు వరుణ్. సాధారణంగా గర్భంతో ఉన్నవారికి ఆకలి (క్రేవింగ్స్) ఎక్కువ వేస్తుంది. రుచికరమైన వాటిని, వెరైటీ ఫుడ్ తినాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన భార్య కోసం చెఫ్‌ గా మారిపోయాడు వరుణ్‌ తేజ్. ఇంట్లో ఎంతో మంది చెఫ్ లు ఉన్నా సరే తానే స్వయంగా భార్య కోసం టేస్టీ పిజ్జా తయారు చేశాడు.

ఈ సందర్భంగా వరుణ్‌ తానే స్వయంగా పిండి కలుపుతూ.. పిజ్జాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. కిచెన్ లో ఎంతో ఓపికగా ఉంటూ రుచికరమైన పిజ్జా తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లావణ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్‌ తన భార్య కోసం ఎంత కేర్ తీసుకుంటున్నాడో ఇది చూస్తే అర్థమవుతుందంటూ మెగా ప్రిన్స్ కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పిజ్జా తయారు చేస్తోన్న వరుణ్ తేజ్.. వీడియో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. హారర్ థ్రిల్లర్ ఈ మూవీ తెరకెక్కుతోంది.

లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.