Vakeel Saab Actress Ananya Nagalla: పవన్ కళ్యాణ్‌‌‌‌తో జరిగిన డిస్కషన్స్ ఎప్పటికీ మర్చిపోలేనంటున్న హీరోయిన్..

మల్లేశం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఈ తెలుగమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటించి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Vakeel Saab Actress Ananya Nagalla: పవన్ కళ్యాణ్‌‌‌‌తో జరిగిన డిస్కషన్స్ ఎప్పటికీ మర్చిపోలేనంటున్న హీరోయిన్..
Ananya Nagalla
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 07, 2021 | 10:00 AM

Actress Ananya Nagalla: మల్లేశం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఈ తెలుగమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటించి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన అనుభవాలను అనన్య తెలిపింది.  అనన్య మాట్లాడుతూ.. “మల్లేశం సినిమా రిలీజ్ అయ్యాక దర్శకుడు శ్రీరామ్ వేణుగారు ఆ సినిమా చూసి వకీల్ సాబ్ లో ఈ క్యారెక్టర్ కు నేను సరిపోతానని పిలించారు. మూడు రౌండ్స్ ఆడిషన్ చేశాక సెలెక్ట్ చేశారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అని నాకు ముందు తెలియదు. తెలిశాక సర్ ప్రైజ్ అయ్యాను.

జీవితంలో ఊహించని ఆనందం ఎదురైతే మనం వెంటనే దాన్ని నిజం అనుకోము. ఇదోదే కల అనిపిస్తుంటుంది. వకీల్ సాబ్ చిత్రంలో నా సెలెక్షన్ జరిగిన తర్వాత కూడా అదే ఫీలింగ్ కలిగింది. చిత్ర పరిశ్రమలో ఎన్నో రిజెక్షన్స్ చూసి వచ్చాను కాబట్టి, కొన్ని రోజులు అయ్యాక గానీ నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటిస్తున్నాను అనే నమ్మకం కలగలేదు అని చెప్పుకొచ్చింది. అలాగే వకీల్ సాబ్ సినిమాలో నా పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. తన పనేదో తన చూసుకునే అమ్మాయిలా కనిపిస్తాను. నేను చేసిన క్యారెక్టర్ మన జీవితంలో తరుచుగా చూస్తుంటాం. ఇలాంటి ఒక అమ్మాయికి సమస్య వస్తే, అయ్యో తనకు ఇలా జరిగిందా అని బాధపడేలా ఉంటుంది. నా క్యారెక్టర్ మీద ప్రేక్షకులు సింపథీ చూపిస్తారు అంటుంది అనన్య. అలాగే పవన్ కళ్యాణ్ గారితో సెట్ లో గడిపిన సమయం మర్చిపోలేను. ఆయనతో ఫన్ గా టైమ్ గడిచింది, పవన్ గారు చెప్పే విషయాలు ఇన్ స్పైరింగ్ గా ఉండేవి. అలాగే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో డీప్ డిస్కషన్స్ ఉంటాయి. సరదాగా మనం మాట్లాడుకునే విషయాలు మాట్లేందుకు ఆయన ఆసక్తి చూపించరు. వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఏపీ లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే ఆ విషయం గురించి పవన్ గారు నాతో మాట్లాడారు. దిశ ఇన్సిడెంట్ లాంటివి అమ్మాయిల మీద జరిగినప్పుడు వాటి మీద పోరాటం చేసేందుకు నేనేమీ చేయలేను, నాకేమీ శక్తి లేదు అనుకోవద్దు నీ ప్రార్థనను యూనివర్స్ కు పంపించు. అది కూడా ప్రభావం చూపిస్తుందని పవన్ గారు చెప్పేవారు. ఆయనతో జరిగిన ఇలాంటి రెండు మూడు డిస్కషన్స్ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చింది అనన్య.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Most Eligible Bachelor: ఆకట్టుకుంటున్న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సాంగ్

Karthika Deepam: సవతి తల్లి పెంపకంలో కష్ఠాలు నీకు తెలుసు… మళ్ళీ నీ పిల్లలకు అదే పరిస్థితి రావాలా అంటున్న సౌందర్య  

Nabha Natesh : ఇదే నా తొలి రీమేక్ సినిమా అంటున్న ఇస్మార్ట్ హీరోయిన్.. నితిన్ సినిమాలో నభనటేష్

Ravi Teja : మరో సారి మాస్ రాజా సినిమా గురించి టాక్.. రవితేజ కోసం అదిరిపోయే కథను సిద్ధంచేస్తున్న దర్శకుడు

ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
'చూడముచ్చటైన జంట'.. పీవీ సింధు-సాయిల పెళ్లి ఫొటోలు చూశారా?
'చూడముచ్చటైన జంట'.. పీవీ సింధు-సాయిల పెళ్లి ఫొటోలు చూశారా?
ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?
ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?
వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..!
వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?