Urvashi Rautela-Pawan Kalyan: ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్’.. ఊర్వశీని ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్..

|

Jul 28, 2023 | 11:27 AM

శుక్రవారం బ్రో రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేసింది ఊర్వశీ రౌతేలా. అందులో ఆమె పవన్ కళ్యాణ్ గురించి స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ పేర్కొంది. ఇంకెముంది ఇది చూసిన నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Urvashi Rautela-Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఊర్వశీని ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్..
Urvashi Rautela,pawan Kalya
Follow us on

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్రో సందడి మొదలైంది. మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే థియేటర్ల వద్ద, ఇటు సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ చేశారు మెగా ఫ్యాన్స్. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. మై డియర్ మార్కండేయ పాటలో ఈ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తాజాగా నెట్టింట ఊర్వశీ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అందుకు కారణం లేకపోలేదు.. శుక్రవారం బ్రో రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేసింది ఊర్వశీ రౌతేలా. అందులో ఆమె పవన్ కళ్యాణ్ గురించి స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ పేర్కొంది. ఇంకెముంది ఇది చూసిన నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

“బ్రో సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‏తో తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది. ” అంటూ ట్వీట్ చేసింది. ఇక ఇది చూసిన నెటిజన్స్.. ఊర్వశీ ట్వీట్ పై భిన్నంగా స్పందిస్తూన్నారు. ఏపీ సీఎం జగన్.. మీకు ఈ విషయం ఎవరు చెప్పారు ?.. పవన్ సీఎం ఎప్పుడయ్యారు ?. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశీ ట్వీట్ స్క్రీన్ షార్ట్స్ తీసి మరీ షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ మరోసారి దేవుడి పాత్రలో అలరిస్తున్నారు. మొదటి సారి సాయి తేజ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు మెగా అభిమానులు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.