AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu OTT Platform: వినాయకచవితి సందర్భంగా రేపు థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్‌లు ఇవే..

Telugu OTT Platform: దేశంలో కరోనా అడుగు పుట్టకముందు థియేటర్ లో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూసేవారు. అయితే కోవిడ్ సమయంలో లాక్ డౌన్ విధినప్పటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్..

Telugu OTT Platform: వినాయకచవితి సందర్భంగా రేపు థియేటర్లలో, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు వెబ్ సిరీస్‌లు ఇవే..
Degirtal Movies
Surya Kala
|

Updated on: Sep 09, 2021 | 6:58 PM

Share

Telugu OTT Platform: దేశంలో కరోనా అడుగు పుట్టకముందు థియేటర్ లో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూసేవారు. అయితే కోవిడ్ సమయంలో లాక్ డౌన్ విధినప్పటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఓటిటి లో సినిమాలు రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే చిన్న పెద్ద సినిమాలు ఓటీటీల్లో పలు సినిమాలు సందడి చేశాయి. తాజాగా వినాయక చవితిని పురష్కరించుకుని థియేటర్స్ లో , ఓటిటిలో విడుదల కానున్న సినిమాల వివరాల్లోకి వెళ్తే..

థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు 

గోపీ చంద్ తమన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ‘సిటీమార్‌’ మూవీ సెప్టెంబర్‌ 10న థియేటర్లో సందడి చేయనుంది.  సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

దివంగత నటి, ముఖ్యమంత్రి జయలలిత బయో పిక్ గా తెరకెక్కిన ‘తలైవి’ రేపు రిలీజ్ కానుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా జయలలితగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో  రిలీజ్ కానుంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు పడిన కష్టాలు. ఇబ్బందులను ఇతి వృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ‘జాతీయ రహదారి’ సినిమా కూడా రేపు థియేటర్ లో  విడుదల కానున్నది.

ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌‌ : రేపు నాని మూవీ టక్‌ జగదీష్‌ తో పాటు ముంబై డైరీస్‌ 26/11 , లూలా రిచ్‌ , మాటల్‌ కమ్‌బాట్‌ , హెచ్‌బీవో మ్యాక్స్‌ , మాలిగ్‌నాంట్‌ లు స్ట్రీమింగ్ కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌‌ :  ఈరోజు సెప్టెంబర్‌ 09 న బ్లడ్‌ బ్రదర్స్‌ రిలీజ్ అయ్యింది. ఇక రేపు వినాయక చవితి సందర్భంగా మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌ , కేట్‌ ,  మెటల్‌ షాప్‌ మాస్టర్స్‌  లు ప్రసారం కానున్నాయి.

ఆహా : మహాగణేశా,  ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ, వూట్‌ క్యాండీ లు స్ట్రీమింగ్ కానున్నాయి. జీ 5   : రేపు వినాయక చవితి కానుకగా నెట్‌ , డిక్కీ లూనా ,  క్యా మెరీ సోనమ్‌ గుప్తా బెవాఫా హైలు స్ట్రీమింగ్ కానున్నాయి.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌   :  సెప్టెంబర్‌ 11న తుగ్లక్‌ దర్బార్‌ ప్రసారం కానున్నది.

Also Read:  వినాయక చవితి జరుపుకుంటే చదువు వస్తుంది.. ఉత్సవాలకు అనుమతి ఇవ్వమని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు చిన్నారులు..