Bigg Boss 5: బిగ్ బాస్: కెప్టెన్సీ టాస్క్‌లో రచ్చ.. హౌస్‌కు తొలి కెప్టెన్‌గా చలాకీ సిరి.!

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన కంటెస్టెంట్లు ఒకరి మాట మరొకరు వినరు. తద్వారా ఏడుపులు, గొడవలు, పెడబొబ్బలు మొదలవుతాయి. మరొకరి మాట..

Bigg Boss 5: బిగ్ బాస్: కెప్టెన్సీ టాస్క్‌లో రచ్చ.. హౌస్‌కు తొలి కెప్టెన్‌గా చలాకీ సిరి.!
Bigg Boss

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన కంటెస్టెంట్లు ఒకరి మాట మరొకరు వినరు. తద్వారా ఏడుపులు, గొడవలు, పెడబొబ్బలు మొదలవుతాయి. మరొకరి మాట పట్టించుకోకుండా.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్న హౌస్‌మేట్స్‌ను స్ట్రిక్ట్ చేసేందుకు కెప్టెన్ వచ్చేశాడు. ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌కు తొలి కెప్టెన్‌గా సిరి హన్మంత్ ఎంపికైంది. ఈ చలాకీ పిల్ల హౌస్‌లో ఉన్న దేశముదుర్లను ఎలా తట్టుకుంటుందో వేచి చూడాలి.

కెప్టెన్సీ టాస్క్…

హౌస్‌కు కెప్టెన్‌ను ఎంచుకునే క్రమంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సూపర్ పవర్ టాస్క్ పెట్టాడు. ఇందులో విశ్వ, మానస్, సిరి హన్మంత్‌తో పాటు హమీదా కూడా సూపర్ పవర్ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక సూపర్ పవర్ సాధించిన ఈ నలుగురు కెప్టెన్సీ టాస్క్‌కు సిద్దమని ప్రకటించారు. కెప్టెన్సీ కోసం పోటీపడుతున్న ఈ నలుగురికి సైకిలింగ్ టాస్క్ ఇచ్చినట్లు సమచారమ. ఈ టాస్క్‌లో మిగతా హౌస్‌మేట్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు మద్దతు పలికారు. కాగా, విశ్వ, మానస్, సిరి హన్మంత్‌, హమీదా మధ్య జరిగిన టఫ్ ఫైట్‌లో సిరి హన్మంత్ కెప్టెన్సీని చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనితో తొలివారం బిగ్ బాస్‌లో సిరి కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu