F3 Movie : మే 27న థియేటర్ లో నవ్వులే నవ్వులు.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎఫ్3

|

May 21, 2022 | 8:00 AM

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్ వరుణ్ తేజ కలిసి నటిస్తున్న సినిమా ఎఫ్ 3. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

F3 Movie : మే 27న థియేటర్ లో నవ్వులే నవ్వులు.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎఫ్3
F3
Follow us on

విక్టరీ వెంకటేష్( venkatesh), మెగా ప్రిన్ వరుణ్ తేజ(varun tej) కలిసి నటిస్తున్న సినిమా ఎఫ్ 3(F3). బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఎఫ్ 2 చిత్రానికి సిక్వెల్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఎఫ్ 3 సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే వరుసగా ఇంట్రవ్యూలు ఇస్తూ హీరోలు దర్శకుడు ఫుల్ బిజీగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘U’ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 28 నిమిషాల నిడివితో ఈ చిత్రానికి క్లీన్ యూ ఇచ్చినట్టు సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపారు. ఇటీవల రిలీజ్ చేయబడిన థియేట్రికల్ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను పెంచేసింది. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఎఫ్ 3 సినిమాలో వెంకీకి నైట్ బ్లైండ్ నెస్ సమస్య ఉండగా.. వరుణ్ నత్తితో బాధపడుతుంటాడు. హీరోయిన్లు తమన్నా భాటియా – మెహ్రీన్ పాత్రలు కూడా వినోదభరితంగా ఉండనున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా తప్పకుండ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

kangana Raunaut: ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన కంగనా రనౌత్.. దాని ధర ఎంతంటే..?

NTR Movie: 20ఏళ్ల కల నెరవేరిందంటున్న కేజీఎఫ్‌ డైరెక్టర్‌..ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..ట్విట్స్‌ వైరల్‌

JR. NTR Fans Hungama: అర్ధరాత్రి ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అసలేం జరిగింది..? పోలీసు లాఠీ ఛార్జ్‌ ముందు పరిస్థితి ఎంటీ..? వీడియోలు వైరల్‌