AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‏తో పోరాడుతూ యంగ్ హీరో మృతి..

ప్రముఖ టీవీ నటుడు విభు రాఘవ్ సోమవారం తుది శ్వాస విడిచారు. విభు అసలు పేరు వైభవ్ కుమార్ సింగ్ రాఘవ్. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుముశారు.

Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‏తో పోరాడుతూ యంగ్ హీరో మృతి..
Vibhu Raghav
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2025 | 12:17 PM

Share

సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టెలివిజన్ నటుడు విభు రాఘవ్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ స్టేజ్ 4తో పోరాడుతున్న విభు రాఘవన్.. చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. బుల్లితెరపై నిషా అండ్ ఉస్కే కజిన్స్, సువారిన్ గుగ్గల్, రిథమ్ వంటి సీరియల్స్ ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. వైవిధ్యమైన పాత్రలలో అద్భుతమైన నటనతో ప్రసిద్ధి చెందాడు. 2022 ఏడాది ప్రారంభంలో ఆయన క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి చికిత్స తీసుకుంటున్నారు. విభు రాఘవ్ మరణవార్తతో టీవీ పరిశ్రమలో శోకసంద్రంలో మునిగిపోయింది.

‘యే రిష్టే హై ప్యార్ కే’ ఫేమ్ నటి కావేరి ప్రియమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విభు మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. అలాగే ‘బిగ్ బాస్ 18’ విజేత కరణ్‌వీర్ మెహ్రా కూడా విభుకు నివాళులర్పించారు. పరిశ్రమలోని అనేక మంది ఇతర తారలు సోషల్ మీడియా ద్వారా విభును గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో విభు రాఘవ్ కు పెద్ద శస్త్ర చికిత్స జరిగింది. తన శరీరంలోని కణితిని తొలగించారు. విభు కోలువడానికి ధృడమైన ఆలోచన, కుటుంబం, సన్నితుల మద్దతు కారణమని పేర్కొన్నాడు.

విభు రాఘవ్ తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో అభిమానులకు అప్‌డేట్ చేస్తూనే ఉండేవాడు. క్యాన్సర్‌తో పోరాడటంలో ఉన్న ఇబ్బందుల గురించి ఆయన తరచుగా మాట్లాడేవారు. తనకు మద్దతుగా నిలిచిన సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు. విభు రాఘవ్ మరణంతో టీవీ పరిశ్రమలో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..