Nani Tuck Jagadish: నాని ‘టక్ జగదీష్’ సినిమా రిలీజ్ పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Nani Tuck Jagadish: నాని టక్ జగదీష్ సినిమా రిలీజ్ పై రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Updated on: May 27, 2021 | 2:28 PM

Nani Tuck Jagadish: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రీతువర్మ  హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు నాని అన్న గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘టక్ జగదీష్’ పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కల్లోలం కారణంగా సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోయి రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘టక్ జగదీష్’ సినిమా కూడా వాయిదా పడింది.  దాంతో ఈ సినిమాపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 23న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టక్ జగదీష్ ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నారంటూ రూమర్స్ వచ్చాయి.

ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ సెట్ అయ్యిందని త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలని.. టక్ జగదీష్ సినిమా థియేటర్లలోనే వస్తుందని క్లారిటీ ఇచ్చారు. ”టక్ జగదీష్ సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుంది. ఇది థియేటర్ ఎక్సపీరియన్స్ కోసం రూపొందిస్తున్న సినిమా ఇది. దయచేసి ఓటీటీ రిలీజ్ అంటూ వచ్చే పుకార్లను నమ్మవద్దు. టక్ జగదీష్ చిత్రాన్ని కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసి ఆనందించండి” అంటూ చిత్రయూనిట్ ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

భార్య ప్రియాంక‌ ఆత్మ‌హ‌త్య కేసులో దివంగ‌త న‌టుడి కుమారుడు అరెస్టు.. అసలు సంగతి ఇదే..

Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్‌కు నిరాశే.. సర్కారు వారి పాట ఫస్ట్‌లుక్ ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే..?

RRR Movie Updates: రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై మరో కీలక అప్‌డేట్స్‌.. కనివిని ఎరుగని రీతిలో బిజినెస్‌