Sravana Bhargavi : చట్టపరంగా యాక్షన్‌ తీసుకుంటాం.. శ్రావణ భార్గవి వివాదం పై స్పందించిన టీటీడీ చైర్మన్

సింగర్ శ్రావణ భార్గవి.. ఈ పేరు ఈమధ్య కాలంలో తెగ వినిపిస్తోన్న పేరు. ఓకే ఒక్క వీడియోతో ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్ లో మారు మ్రోగుతోంది.

Sravana Bhargavi : చట్టపరంగా యాక్షన్‌ తీసుకుంటాం.. శ్రావణ భార్గవి వివాదం పై స్పందించిన టీటీడీ చైర్మన్
Sravana Bhargavi,yv Subba R

Updated on: Jul 25, 2022 | 7:56 AM

సింగర్ శ్రావణ భార్గవి( Sravana Bhargavi ).. ఈ పేరు ఈ మధ్య కాలంలో తెగ వినిపిస్తోన్న పేరు. ఓకే ఒక్క వీడియోతో ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్ లో మారు మ్రోగుతోంది. గత కొన్నిరోజులుగా ఒకపరి సంకీర్తన వీడియో పై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అన్నమయ్య భక్తి పాటను అశ్లీలంగా చిత్రీకరించారంటూ భక్తులు శ్రావణ భార్గవి పై మండిపడ్డారు. అన్నమాచార్య కుటుంబ సభ్యుల అభ్యంతరం.. అన్నమయ్య అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో సింగర్ శ్రావణ భార్గవి వెనక్కి తగ్గారు. ఆ వీడియో నుంచి పాటను తొలగించి కేవలం మ్యూజిక్ తోనే ఆ వీడియోను యూట్యూబ్ లో ఉంచారు. ఇదిలా ఉంటే సింగర్ శ్రావణ భార్గవి వివాదంపై సీరియస్‌గా రియాక్టయ్యారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అన్నమాచార్యుల రచనలను కీర్తనలను ఎవరైనా అపహాస్యం చేస్తే మహాపాప౦ అవుతుందన్నారు.

అన్నమయ్య సంకీర్తనలను దుర్వినియోగం చేసే చర్యలను టీటీడీ ఎంకరేజ్‌ చేయదని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. ఒకవేళ అలాంటి పనులు ఎవరైనా చేస్తే చట్టపరంగా టీటీడీ యాక్షన్‌ తీసుకుంటుందన్నారు వైవీ సుబ్బారెడ్డి. అన్నమయ్య కీర్తనలకు రచనలకు తమ ప్రభుత్వం విశిష్ట ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందుకే అన్నమయ్య నడియాడిన ప్రాంతానికి ఆయన పేరు పెట్టామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మరి ఈ వివాదం ఇంకెత దూరం వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి