AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

True Lovers Trailer: వాలెంటైన్ వీక్‏ ముందే ‘ట్రూ లవర్’ ట్రైలర్.. యూత్‏కు కనెక్ట్ అవుతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ..

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ తో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మణికందన్ జోడిగా గౌరీ ప్రియా నటిస్తుంది. గతంలో రైటర్ పద్మ భూషణ్, మ్యాడ్ సినిమాలతో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కాసేపటి క్రితం విడుదలైన ట్రైలర్ యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది.

True Lovers Trailer: వాలెంటైన్ వీక్‏ ముందే 'ట్రూ లవర్' ట్రైలర్.. యూత్‏కు కనెక్ట్ అవుతున్న ఎమోషనల్ లవ్ స్టోరీ..
True Lover
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2024 | 9:43 PM

Share

గుడ్ నైట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కోలీవుడ్ నటుడు మణికందన్. గతేడాది ఓటీటీలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు అతడు నటించిన లేటేస్ట్ ట్రూ లవర్. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. గుడ్ నైట్ మేకర్స్. సేమ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ తో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మణికందన్ జోడిగా గౌరీ ప్రియా నటిస్తుంది. గతంలో రైటర్ పద్మ భూషణ్, మ్యాడ్ సినిమాలతో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కాసేపటి క్రితం విడుదలైన ట్రైలర్ యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ గమనిస్తే..ఇద్దరు లవర్స్ చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంటుంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు.. మనస్పర్థలు… అయినా మళ్లీ కలుసుకుంటారు. ప్రేమించిన అమ్మాయితో కలిసి జీవితాంతం బతకాలని అనుకుంటాడు అబ్బాయి. కానీ అమ్మాయి మాత్రం పెళ్లికి టైమ్ కావాలని అడుగుతుంటుంది. డబ్బుకు మాత్రమే విలువ ఉంటుందని.. తనకు విలువ ఉండదని బాధపడుతుంటాడు అబ్బాయి. పెళ్లి విషయం ఇంట్లో మాట్లాడటానికి వెళ్లిన అమ్మాయికి మరికొందరితో పరిచయం ఏర్పడుతుంది. హీరోచాలాసార్లు ఆ అమ్మాయి పై కోప్పడుతుంటాడు. అతడి మాటలకు అమ్మాయి ఎంతో బాధపడుతుంటుంది. గొడవలైనా కలిసుండాలనే ఆరాటం ఇద్దరిదీ.. కానీ.. మనస్పర్థలతో దూరమైనా బంధం మళ్లీ కలుస్తుందా ?.. చివరకు వారి ప్రేమను గెలిపించుకున్నారా ? అనేది సినిమా.

తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. మరో ప్రేమకథ యూత్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సీన్ రోల్డన్ సంగీతం అందించారు. ఇందులో కన్నా రవి, గీతా కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్ కీలకపాత్రలు పోషించారు. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us